రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకూ అత్యాచారాలు పెరిగిపోతున్నాయని మహిళా మోర్చా సంచాలకురాలు సులోచన...
రాయచూరు రూరల్ : రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకూ అత్యాచారాలు పెరిగిపోతున్నాయని మహిళా మోర్చా సంచాలకురాలు సులోచన ఆందోళన వ్యక్తం చేశారు. అత్యాచార ఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ సూపర్ మార్కెట్ వద్ద మంగళవారం చేపట్టిన ధర్నాలో ఆమె ప్రసంగించారు.
రాష్ట్రంలో మహిళలపై దాడులు, హత్యలు చేయడం నిలుపుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో 6 నెలలలో 479 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయని, వీటిపై చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కార్యక్రమంలో సుమతీ శాస్త్రి, శరణమ్మ, సుశీల, సరోజమ్మ తదితరులున్నారు.