కరుణ ఇంట పండగ కళ | Karunanidhi turns 94 | Sakshi
Sakshi News home page

కరుణ ఇంట పండగ కళ

Published Fri, Jun 3 2016 5:24 PM | Last Updated on Mon, Sep 4 2017 1:35 AM

కరుణ ఇంట పండగ కళ

కరుణ ఇంట పండగ కళ

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధి ఇంటికి పండగ కళ వచ్చింది. శుక్రవారం కరుణానిధి పుట్టినరోజు కావడమే దీనికి కారణం. ఆయన ఈ రోజు 94వ ఏట అడుగుపెట్టారు.

కరుణానిధి కుటుంబ సభ్యులతో పాటు డీఎంకే నేతలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. కరుణకు శుభాకాంక్షలు చెప్పేందుకు డీఎంకే సీనియర్ నేతలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయన ఇంటికి క్యూ కట్టారు. దీంతో ఈ రోజు ఉదయం నుంచి కరుణ నివాసం సందడిగా మారింది. కరుణానిధి పార్టీ సీనియర్ నేతలు, కుటుంబ సభ్యులతో కలసి భోజనం చేశారు.

ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే ఓటమి చవిచూడగా, అన్నాడీఎంకే విజయం సాధించిన సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే చీఫ్‌ జయలలిత వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి రికార్డు సృష్టించగా, అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన డీఎంకే ప్రతిపక్షానికి పరిమితమైంది. కాగా ఈ ఎన్నికల్లో డీఎంకే గట్టి పోటీనివ్వడంతో పాటు బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. కరుణానిధి కుటుంబం, డీఎంకే శ్రేణులు ఈ ఓటమి తాలుకూ ప్రభావాన్ని మరిచి సంతోషంగా పెద్దాయన జన్మదిన వేడుకలు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement