ధనుష్‌తో కీర్తీసురేష్‌కు లేనట్లేనా? | Keerthi Suresh is definitely a part of the Dhanush | Sakshi
Sakshi News home page

ధనుష్‌తో కీర్తీసురేష్‌కు లేనట్లేనా?

Published Sat, Aug 22 2015 3:29 AM | Last Updated on Sun, Sep 3 2017 7:52 AM

ధనుష్‌తో కీర్తీసురేష్‌కు లేనట్లేనా?

ధనుష్‌తో కీర్తీసురేష్‌కు లేనట్లేనా?

 ఎంట్రీతోనే కోలీవుడ్‌లో ఒక హైప్‌ను క్రియేట్ చేసుకున్న బ్యూటీ కీర్తీ సురేష్. ఆమె తల్లి సీనియర్ తమిళ నటి కావడం ఒక కారణం కావచ్చు లేదా లేలేత అందాల క్యూట్ లుక్ కలిగి ఉండడం కారణం అయ్యి ఉండవచ్చు. ఒక్క చిత్రం కూడా విడుదల కాకుండా నాలుగైదు చిత్రాలు కమిట్ అయిన నటి కీర్తీ సురేష్. వాటిలో విక్రమ్‌ప్రభు సరసన నటించిన ఇదు ఎన్న మాయం చిత్రం ఇటీవల విడుదలై ఓకే అనిపించుకుంది. ప్రస్తుతం శివకార్తికేయన్‌కు జంటగా నటించిన రజనీమురుగన్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది.
 
  బాబీసింహతో నటిస్తున్న పాంబు సండై,  జీవాతో జత కడుతున్న కవలైవేండామ్ చిత్రాలతో పాటు మలయాళంలోనూ నటిస్తున్నారు. ధనుష్ సరసన ప్రభుసాల్మన్ దర్శకత్వంలో నటించడానికి కీర్తీసురేష్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అయితే ఇప్పుడా చిత్రం నుంచి వైదొలిగినట్లు కోలీవుడ్ టాక్. కారణం కాల్‌షీట్స్ సర్దుబాటు కాకపోవడమేనని సమాచారం. అలాగే విశాల్‌కు జంటగా సండైకోళీ-2 చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకోలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలిసింది. ఇప్పటి వరకూ తమిళంలో యువ కథానాయకలతోనే నటించిన కీర్తీసురేష్ ధనుష్, విశాల్ లాంటి స్టార్ హీరోలతో జత కట్టే అవకాశాలను వదులుకోవడం బాధాకరమైన విషయమే నంటున్నారు కోలీవుడ్ వర్గాలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement