చిన్న సినిమాలను బతికించండి.. | Ketireddy Jagadishwar Reddy met Union Minister Arun Jaitley in Delhi | Sakshi
Sakshi News home page

చిన్న సినిమాలను బతికించండి..

Published Mon, Aug 14 2017 11:49 AM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM

చిన్న సినిమాలను బతికించండి.. - Sakshi

చిన్న సినిమాలను బతికించండి..

చెన్నై: జీఎస్టీతో ప్రాంతీయ సినిమాలు ఎదుర్కొంటున్న సమస్యలను తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, చలనచిత్ర నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఢిల్లీలో  కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీని కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జీఎస్టీతో చిత్ర పరిశ్రమకు రూ.100లోపు టిక్కెట్‌పై 18శాతం, రూ.100 పైన టిక్కెట్‌కు 28శాతం ట్యాక్స్‌ నిర్ణయించారు. ఈమేరకు ఆదివారం చెన్నైలో కేతిరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో.. జీఎస్టీతో చిన్న సినిమా, ప్రాంతీయ భాషా చిత్రాల మనుగడ కష్టంగా ఉంటుందని పేర్కొన్నారు.

ప్రాంతీయ భాషా చిత్రాలకు 12శాతం పన్ను నిర్ణయించాలని కోరుతూ అరుణ్‌జైట్లీకి వినతిపత్రం సమర్పించారు. అలాగే చిరు వర్తకుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. హైబ్రిడ్‌ వాహనాలపై  28శాతం, ఎలక్ట్రిక్‌ పరికరాలపై –12 సెస్సు, ప్లాస్టిక్‌ – 28శాతం, ఆయుర్వేద ఉత్పత్తులపై 12శాతం జీఎస్టీతో ఆ రంగాలు  దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ రంగాలపై పన్ను తగ్గించాల్సిందిగా ప్రజలు కోరుతున్నారని కేతిరెడ్డి వినతిపత్రంలో పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement