శింబు,నయన మధ్య ప్రేమ ఎలా మొదలైంది? | 'Kettavan movie is the Real love story of Simbu-Nayanthara affair | Sakshi
Sakshi News home page

శింబు,నయన మధ్య ప్రేమ ఎలా మొదలైంది?

Published Wed, Jun 3 2015 2:15 AM | Last Updated on Sun, Sep 3 2017 3:07 AM

శింబు,నయన మధ్య ప్రేమ ఎలా మొదలైంది?

శింబు,నయన మధ్య ప్రేమ ఎలా మొదలైంది?

 శింబు, నయనతార రియల్ ప్రేమకథ తెరకెక్కడానికి ముహూర్తం పడి చాలా రోజులైంది. పది శాతం చిత్రీకరణ కూడా జరిగి ఆగిపోయింది. ఈ చిత్రం పేరు కెట్టవన్. అంటే చెడ్డవాడు అని అర్థం. నిజ జీవితంలో శింబు, నయనతార మధ్య ప్రేమ ఎలా మొదలైంది? ఎంత శిఖరాగ్రానికి చేరింది? ఎలా ముగిసింది? ఇత్యాది అంశాలతో కూడిన ఈ చిత్రంలో హీరోయిన్ మాత్రం లేఖ వాషింగ్‌టన్. నవ దర్శకుడు నందు కథ, దర్శకత్వం బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు. అయితే ఫైనాన్స్ సమస్య కారణంగా చిత్ర నిర్మాణం అటకెక్కిందని సమాచారం.
 
 ఈ కారణంగా ప్రేక్షకులకు శింబు, నయనతార ప్రేమకథను తెరపై చూసే అవకాశం లేకుండా పోయింది. ఆ చిత్రానికి మళ్లీ ఇప్పుడు బూజు దులుపుతున్నారనే విషయం అందరికీ శుభవార్తే. చిత్ర నిర్మాణాన్ని పునః ప్రారంభించడానికి ఆ చిత్ర నిర్మాత సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ విషయమై దర్శకుడు నందు ఇటీవల శింబుతో కలిసి చర్చించినట్లు తెలిసింది. శింబు కూడా దీనికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ప్రస్తుతం శింబు సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఒక చిత్రం, గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో అచ్చం ఎంబదు మడమయ డా చిత్రంలో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తి చేసి కెట్టవన్‌కు సిద్ధమవుతానని మాట ఇచ్చినట్లు తెలి సింది.
 
 మొదట ఈ చిత్రంలో నటించిన నటి లేఖా వాషింగ్‌టన్‌ను ఇప్పుడు ప్రేక్షకులు మర్చిపోవడంతో ఆ పాత్రలో ఒక ప్రముఖ నటిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని తెరకెక్కించడాన్ని అప్పట్లో నయనతార తీవ్రంగా వ్యతిరేకించినట్లు ప్రచారం జరిగింది. ఆమే ఇప్పుడు శింబుతో కలిసి ఇదు నమ్మ ఆళు చిత్రంలో నటించారు. మరి కెట్టవన్ పునః ప్రారంభం గురించి ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement