ద్రోహులకు బుద్ధి చెబుదాం | Let's fight together against traitors | Sakshi
Sakshi News home page

ద్రోహులకు బుద్ధి చెబుదాం

Published Tue, Sep 5 2017 8:06 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

ద్రోహులకు బుద్ధి చెబుదాం - Sakshi

ద్రోహులకు బుద్ధి చెబుదాం

తమిళసినిమా: చేయి చేయి కలిపి పోరాడుదాం ద్రోహులకు బుద్ధి చెబుదాం.. లేదా పారద్రోలుదాం అని నటుడు కమలహాసన్‌ పిలుపునిచ్చారు. ఈయన ఇటీవల రాజకీయాలపై తరచూ స్పందిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రం అవినీతి మయంగా మారిపోయిందంటూ మంత్రులపై ఆరోపణల దాడి చేస్తున్నారు.  ఇటీవల వామపక్ష నాయకులను తాను హీరోలుగా భావిస్తానని పేర్కొన్న కమల్‌ తాజాగా తమిళనాడులో జరుగుతున్న ద్రోహాలను సహించేది లేదంటూ ధ్వజమెత్తారు.

ఈ సందర్భంగా మరోసారి తన రాజకీయరంగ ప్రవేశం తథ్యమనే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షోలో ఎలిమినేట్‌ అయిన నటుడు శక్తి ఆదివారం తిరిగి పాల్గొన్న సందర్భంగా కమలహాసన్‌ను రాజకీయాల్లోకి రావాలన్న కోరికను వ్యక్తం చేశారు. అందుకు కమల్‌ స్పందిస్తూ ఇకపై తాను రాజకీయాల గురించి వ్యంగ్యంగా మాట్లాడనన్నారు. ఎవరు ఎలా ఉన్నా తాను ఇలాగే ఉంటానని, జరుగుతున్న ద్రోహాలను చూస్తూ చేతులు కట్టుకుని కూర్చోనని అన్నారు. 


నీట్‌ వ్యవహారంలో ఆత్మహత్య చేసుకున్న అనితలా మరొకరు బలి కారాదన్నారు. ఇలాంటి సంఘటనలను అధిగమిద్దాం. జాతి, మతం, రాజకీయాలకతీతంగా పోరాడుదాం. అందుకు తాను రెడీ. అంత భారం మోసే శక్తి నాకు లేకపోయినా, ప్రపంచం నాకు అండగా నిలుస్తుందని అన్నారు. కాగా సోమవారం ఉదయం మహిళా కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి, నటి నగ్మా కమలహాసన్‌ను ఆయన ఇంట్లో కలవడం చర్చకు దారి తీసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement