మెగాస్టార్ను సీఎం కలిసిన వేళ | Maharashtra Chief Minister Fadnavis, Amitabh Bachchan in Dettol Maha Cleanathon | Sakshi
Sakshi News home page

మెగాస్టార్ను సీఎం కలిసిన వేళ

Published Sat, Sep 3 2016 12:23 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

మెగాస్టార్ను సీఎం కలిసిన వేళ - Sakshi

మెగాస్టార్ను సీఎం కలిసిన వేళ

ముంబై: మహారాష్ట్రలోని 50 నగరాలను అక్టోబర్ 2 నాటికి క్లీన్ సిటీలుగా మార్చుతామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. శనివారం ముంబైలో నిర్వహించిన 'డెటాల్ మహా క్లీనథాన్' కార్యక్రమంలో ఆ కార్యక్రమ ప్రచారకర్త అయిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్తో కలిసి ఫడ్నవిస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ మీడియాతో మాట్లాడిన సీఎం.. రాష్ట్రంలో 7000 గ్రామాలు ఇప్పుడు బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా మారాయని తెలిపారు. పరిశుభ్ర నగరాల విషయంలో ముందుండేలా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని ఆయన వెల్లడించారు. 
 
ఘన వ్యర్థాల మేనేజ్మెంట్ విషయంలో సైతం మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిందని ఫడ్నవిస్ తెలిపారు. ప్రజల భాగస్వామ్యం లేకపోతే పరిశుభ్రత సాధ్యం కాదన్నారు. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుందని భావిస్తున్నానని సీఎం అన్నారు. డెటాల్ మహా క్లీనథాన్ కార్యక్రమంలో అమితాబ్, ఫడ్నవిస్ చీపుర్లు పట్టుకుని రోడ్లు శుభ్రపరిచారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement