సాక్షి,ఢిల్లీ:మహారాష్ట్ర కొత్త సీఎం రేసు నుంచి శివసేన చీఫ్, ప్రస్తుత సీఎం ఏక్ నాథ్ షిండే తప్పుకున్నట్లు తెలుస్తోంది. తనకు మద్దతుగా ముంబైకి ఎవరు రావొద్దని,సమావేశాలు పెట్టొద్దని ఏక్‌నాథ్‌షిండే ట్వీట్ చేయడం సీఎం రేసు నుంచి ఆయన తప్పుకున్నారనడానికి నిదర్శనమన్న ప్రచారం జరుగుతోంది.
महायुतीच्या प्रचंड विजयानंतर राज्यात पुन्हा एकदा आपले सरकार स्थापन होणार आहे. महायुती म्हणून आपण एकत्रित निवडणूक लढवली आणि आजही एकत्रच आहोत. माझ्यावरील प्रेमापोटी काही मंडळींनी सर्वांना एकत्र जमण्याचे, मुंबईत येण्याचे आवाहन केले आहे. तुमच्या या प्रेमासाठी मी अत्यंत मनापासून ऋणी…
— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) November 25, 2024
త్వరలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని మహారాష్ట్ర ప్రగతికి మహాయుతి కూటమి పనిచేస్తుందని షిండే ట్వీట్‌లో పేర్కొన్నారు. సీఎం రేసు నుంచి షిండే తప్పుకోవడం దాదాపు ఖాయమవడంతో బీజేపీ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
మహారాష్ట్ర ఎన్నికల్లో మెజారిటీ మార్కు కు చేరువగా 132 సీట్లను బీజేపీ గెలుచుకుంది. సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్‌కు మద్దతిసస్తామని మహాయుతిలో మరో కీలక భాగస్వామ్య పార్టీ ఎన్సీపీ(అజిత్‌పవార్)ఇప్పటికే ప్రకటించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment