ప్రత్యేక విమానంలో తీసుకువచ్చిన ఢిల్లీ పోలీసులు
బెంగళూరు, న్యూస్‌లైన్ : ఢిల్లీ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన ఇద్దరు ముజాహుద్దీన్ ఉగ్రవాదులను విచారణ నిమిత్తం మంగళవారం మంగళూరు తీసుకువచ్చి విచారణ చేశారు. తెహ్లిన్ అక్తర్ అలియాస్ తెహసిన్ అక్తర్, జియా ఉర్ రెహమాన్‌లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే.
వీరు ఇండియన్ ముజాహుద్దీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్‌కు సన్నిహితులని తేలడంతో వీరిని ప్రత్యేక విమానంలో ఢిల్లీ పోలీసులు మంగళవారం మధ్యాహ్నం బజ్పె విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి భారీ భద్రత మధ్య మంగళూరులోని అత్తావర్‌లో వీరు నివసించిన ఫ్లాట్, వీరు ఉపయోగించిన సైబర్ సెంటర్లకు తీసుకువెళ్లి విచారణ చేశారు.
అదే విధంగా భత్కల్ సొంత ప్రాంతమైన దక్షిణ కన్నడ జిల్లాలోని పలు ప్రాంతాలకు తీసుకువెళ్లి విచారణ చేశారని స్థానిక పోలీసు అధికారి తెలిపారు. భత్కల్‌లో కూడా యాసిన్ కుటుంబ సభ్యులను విచారించినట్లు సమాచారం. అనంతరం నిందితులను ప్రత్యేక విమానంలో ఢిల్లీ తీసుకువెళ్లారు.
మంగళూరులో ఉగ్రవాదుల విచారణ
Published Thu, Apr 10 2014 2:02 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement