రాయగడ రైల్వేస్టేషన్‌లో ఎగుమతికి సిద్ధంగా ఉన్న మామిడి
రాయగడ : రాయగడ జిల్లాలోని కాశీపూర్, కల్యాణసింగుపురం, బిసంకటక్, మునిగుడ, ప్రాంతంలో విదేశీ ఎగుమతికి సంబంధించిన ఉన్నత రకాల మామిడి పంటను ఈ సంవత్సరం జిల్లా యంత్రాంగం సహకారంతో ఢిల్లీలోని మదర్‌డైరీకి ఆదివారం పంపించారు. రాయగడ రైల్వేస్టేషన్ నుంచి మామిడిపండ్ల మొదటి ఎగుమతిని డీఆర్‌డీఏ పీడీ సుఖాంత్ త్రిపాఠి రైల్వే వ్యాగన్లకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలో మామిడి రైతులకు నేరుగా వారి ఖాతాలో మామి డి మద్దతుధర లభించే విధంగా గత సంవత్సరం నుంచి జిల్లా యంత్రాంగం మామిడి ఎగుమతిని చేపట్టింది. గత సంవత్సరం మామిడి రైతులు దళారుల బెడద లేకుండా నేరుగా మంచి లాభా లను ఆర్జించారు.
ఈ సంవత్సరం కూడా అదే రీతిలో మామిడి ఎగుమతి ప్రారంభం కాగా మొదటిరోజు 288కార్టన్‌ల(4.5 టన్నులు) మామిడి పండ్లు ఎగుమతి చేయగా ఢిల్లీలో కేజీ మామిడిపండ్లు రూ.50 నుంచి రూ.67 వరకు ధర పలుకుతున్నట్లు అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరు కావలసి ఉండగా ఇతర కారణాల వల్ల రాలేకపోవడంతో ఆమెకు బదులుగా డీఆర్‌డీఏ పీడీ హాజరయ్యారు. మామిడి సీజన్ పూర్తయినంత వరకు రాయగడ నుంచి మామిడి ఎగుమతి జరుగుతుందని ఈ సందర్భంగా అధికారులు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment