ముంబై: అంతర్జాతీయ విమానాశ్రయంలోని రెండో టెర్మినల్ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముంబై మేయర్ సునీల్ ప్రభు ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు లేఖాస్త్రం సంధించారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవం కోసం ముద్రించిన ఆహ్వానపత్రికలో తన పేరు లేకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఆయన లేఖ రాశారు. ‘మేయర్‌ను అవమానించే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ముంబైకర్ల తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది నాకు, నగరవాసులందరికీ అవమానం. ప్రొటోకాల్ ప్రకారం వీవీఐపీలు, దౌత్యవేత్తలు నగరానికి వచ్చినప్పుడు మేయర్ వారికి స్వాగతం, వీడ్కోలు పలకాలి. ప్రారంభోత్సవాల్లో మేయర్‌కు కేబినెట్ మంత్రి హోదా ఉంటుంది’ అని సునీల్ ప్రభు లేఖలో పేర్కొన్నారు.ప్రస్తుత పరిణామం మేయర్ పదవికే అవమానమని ఆయన వ్యాఖ్యానించారు.
నన్నెందుకు పిలవలేదు ?
Published Fri, Jan 10 2014 11:04 PM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM
Advertisement
Advertisement