మాజీ సీఎం కుమారస్వామి
జాతీయ రహదారిని నిర్బంధించిన గోరూరు గ్రామస్తులు
బెంగళూరు: మంత్రి డీకే శివకుమార్ ఒక ప్రైవేట్ కంపెనీలతో కుమ్మక్కై గోరూరు ప్రాంతంలో చెత్త డంపింగ్ చేయడానికి యత్నాలు చేస్తున్నారని మాజీ సీఎం, జేడీఎస్ పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి ఆరోపించారు. శనివారం ఆయన గోరూరు గ్రామస్తులు జాతీయ రహదారి నిర్బంధించిన విషయం తెలుసుకుని అక్కడి చేరుకుని మాట్లాడారు. ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే ఈ పరిసర ప్రాంతాలలో నివాసం ఉంటున్న గ్రామస్తులు ఆనారోగ్యాలకు గురి అవుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త డంపింగ్ యార్డు ఏర్పాటు చేయకూడదని శుక్రవారం శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న మహిళలు, వృద్ధులు, పిల్లలపై పోలీసులు లాఠీచార్జ్ చేసి ప్రతాపం చూపించారని మండిపడ్డారు. మహిళలపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారని తెలుసుకున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే వెంటనే ఈ గ్రామస్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే సందర్బంలో స్థానిక గ్రామస్తులు జాతీయ రహదారిపై రెండు గంటల పాటు ధర్నా చేసి రాష్ట్ర మంత్రి డి.కే. శివకుమార్ దిష్టిబొమ్మ దగ్దం చేసి నిరసన వ్యక్తం చేశారు.
ప్రాణాలు పోయినా ఇక్కడ చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు చెయ్యడానికి అంగీకరించమని మాగడి తాలుకాలోని పలు ప్రాంతాలలో ఉన్న గ్రామస్తులు తేల్చి చెప్పారు. ధర్నాలో బండేమఠాధిపతి బసవలింగస్వామీజి, మహంతేషస్వామీజి, చిలుమమఠస్వామీజి, శాసన సభ్యుడు డాక్టర్ శ్రీనివాసమూర్తి, ఎంఎల్‌సీ, కన్నడ సినీ నిర్మాత ఇ. కృష్ణప్ప, స్థానిక జేడీఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రైవేట్ కంపెనీతో మంత్రి డీకే కుమ్మక్కు
Published Sun, Nov 30 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM
Advertisement
Advertisement