రూ.14 లక్షల విలువైన భగీరథ పైపులు చోరీ
Published Wed, Feb 15 2017 12:13 PM | Last Updated on Tue, Sep 5 2017 3:48 AM
హైదరాబాద్: మేడ‍్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం అవుశాపూర్ గ్రామంలో మిషన్ భగీరథకు సంబంధించిన పైపులను దుండగులు అపహరించుకుపోయారు. బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. దొంగలించిన పైపుల విలువ రూ.13,90,569 లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు నీటిపారుదల అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస‍్తున్నారు.
Advertisement
Advertisement