
ఎమ్మెల్యేలు ఆమెను ఎన్నుకోవచ్చు.. మరి ప్రజలు!
చెన్నై: ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా వ్యవహరించరాదని డీఎంకే ఎంపీ టీకేఎస్ ఇలాంగోవన్ అన్నారు. శశికళ ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్న నేపథ్యంలో.. ‘ఎమ్మెల్యేలు శశికళను ఎన్నుకోవచ్చు. అయితే ప్రజలు ముఖ్యమంత్రిగా ఆమెను అంగీకరిస్తారా అన్నది చూడాలి’ అని ఇలంగోవన్ అన్నారు.
ముఖ్యమంత్రి మార్పు అనేది ఏఐఏడీఎంకే పార్టీ అంతర్గత వ్యవహారమన్న ఇలంగోవన్.. 2011లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే తమిళనాడు భవిష్యత్తు నాశనం అయిందని విమర్శించారు.