తిరువళ్లూరు: తిరువళ్లూరులోని సీవీనాయుడు రోడ్డులో విద్యుత్ షాక్‌కు గురై ఓ వానరం రోడ్డుపై పడి మృతి చెందింది. మృతి చెంది రోడ్డుపై పడి ఉన్న వానరాన్ని కదిలించడానికి మిగిలిన రెండు వానరాలు శతవిధాల ప్రయత్నించాయి. మృతి చెందిన వానరం దగ్గరకు ఎ వ్వరినీ రానీయ్యకుండా అడ్డుకున్నాయి. మృతిచెందిన వానరంలో చలనం లేకపోవడంతో మిగిలిన రెండు వానరాలు మృతి చెందిన వానరాన్ని ముద్దాడి వెనుదిరిగిన సంఘటన అక్కడున్న వారిని కదలించింది. మనుషుల మధ్య మానవత్వం మంటగలుస్తున్న ఈ రోజుల్లో రెం డు వానరాలు తన సహచర వానరంపై చూపి న ప్రేమ అక్కడున్న వారిని ఆలోచింపచేసింది.
కదిలించిన వానర ప్రేమ
Published Mon, Jan 29 2018 6:16 AM | Last Updated on Mon, Jan 29 2018 6:16 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment