పరీక్షా కేంద్రంలో చిన్నారితో తల్లి
సాక్షి బెంగళూరు: పండంటి శిశువుకు జన్మనిచ్చిన తర్వాత నేరుగా పరీక్ష హాల్‌కు వెళ్లి ఎగ్జామ్ రాసిందో 20 ఏళ్ల యువతి.. ఈ అద్భుత ఘటన బెంగళూరు పరిధిలోని సదాశివనగర్‌లో జరిగింది. హర్షిత అనే యువతి బెంగళూరులో బీఎస్సీ డిగ్రీ చివరి ఏడాది చదువుతోంది. మంగళవారం ఆమె స్వల్పంగా నొప్పులు వచ్చినా అలాగే పరీక్ష రాసింది. ఆ తర్వాత పురిటి నొప్పులు రావడంతో నేరుగా ఆస్పత్రికి వెళ్లింది. బుధవారం పండంటి మగ శిశువుకు హర్షిత జన్మనిచ్చింది. గురువారం పరీక్ష ఉండడంతో ఒక చేత్తో శిశువును ఎత్తుకుని, మరో చేత్తో పుస్తకంతో ఆస్పత్రి నుంచి పరీక్ష కేంద్రానికి వచ్చింది. ఒక్క పరీక్ష రాస్తూనే ప్రతి 30 నిమిషాలకొకసారి పక్క గదిలో ఉన్న చిన్నారికి పాలు ఇస్తూ మాతృప్రేమను ప్రదర్శించింది. ఒక శిశువుకు జన్మనిచ్చి ఆ మరుసటి రోజే మూడు గంటలపాటు కూర్చొని పరీక్ష రాయడం అంత సులభం కాదని, చదువు పట్ల హర్షితకు ఉన్న మక్కువను మెచ్చుకుంటూ నగరవాసులు అభినందనలు తెలియజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment