నాలుగేళ్ల బాలికపై పాఠశాలలో..
ముంబై: నాలుగేళ్ల బాలికపై పాఠశాలలో ప్యూన్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ముంబై నగరాన్ని షాక్‌కు గురి చేసింది. నగరంలోని సుబర్బన్ మాలడ్ ప్రాంతంలో గల ఐసీఎస్ బోర్డులో ఈ దారుణం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 1 నుంచి 4 తేదీల మధ్య పాఠశాల ప్యూన్ బాలికపై వాష్‌రూమ్‌లో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపారు. ఆగష్టు 5న బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. పాఠశాలకు వెళ్లిన బాలికపై అత్యాచారం జరగడంపై పిల్లల తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ధర్నాకు దిగారు.