
ప్రతీకాత్మకచిత్రం
ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన అనంతరం గొంతునులిమి హత్యకు పాల్పడిన దుండగులు మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌పై పడవేశారు. ఈనెల 5న అదృశ్యమైన పదేళ్ల బాలిక మృతదేహాన్ని విద్యావిహార్ రైల్వేస్టేషన్ వద్ద పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక అదృశ్యమైన రోజు ఆమెతో ఉన్న వ్యక్తిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించి నిందితుడిని అరెస్ట్ చేశారు. బాలిక తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా దారుణ ఘటన వెలుగుచూసింది.బాలికపై లైంగిక దాడి జరిగిన అనంతరం ఆమెను గొంతుపిసికి పాశవికంగా హతమార్చినట్టు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైందని పోలీసులు తెలిపారు.నిందితుడిని ప్రశ్నిస్తున్న పోలీసులు తదుపరి విచారణను వేగవంతం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment