ఆటోరాణితో కలలరాణి సెల్ఫీ | namitha selfie with lady auto driver | Sakshi
Sakshi News home page

మహిళా ఆటోడ్రైవర్‌ తో హీరోయిన్ సెల్ఫీ

Published Sat, Oct 1 2016 4:07 PM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM

ఆటోరాణితో కలలరాణి సెల్ఫీ

ఆటోరాణితో కలలరాణి సెల్ఫీ

చెన్నై: ఆటోరాణితో కలలరాణి సెల్ఫీ ఫోటో మీడియాలో హల్‌చల్ చేస్తోంది. యువత కలలరాణి నటి నమిత అనడంలో ఏమాత్రం అతిశయోక్తి ఉండదు. ఏనుగు బతికినా వెయ్యే చచ్చినా వెయ్యే అన్న సామెత ఉంది. అదే విధంగా నమిత ఇప్పుడు అధికంగా తెరపై కనిపించకపోయినా సినీ జనాలేకాదు, సాధారణ ప్రజల్లోనూ ఆమె క్రేజే వేరు. ఇప్పటికీ ఏ నూతన షాపు ప్రారంభోత్సవానికి వెళ్లినా నమిత చుట్టూ జనం తొక్కిసలాట జరగాల్సిందే.
 
 అందుకు తగ్గట్టుగానే ఆ ముద్దుగుమ్మ ప్రవర్తన ఉంటుంది. అందుకు గురువారం జరిగిన ఒక సంఘటనను ఒక చిన్న ఉదాహరణగా పేర్కొనవచ్చు. విషయం ఏమిటంటే నమిత గురువారం స్థానిక నెల్సన్‌మాణిక్యం రోడ్డులో కారులో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో అటుగా ఒక మహిళ ఆటో నడుపుకుంటూ రావడం నమిత కంటపడింది. అంతే వెంటనే తన కారు ఆపి కిందకు దిగి ఆ మహిళా ఆటోడ్రైవర్‌ను కలిసి ఆమెతో టక్కున సెల్ఫీలు దిగారు.
 
 ఈ ఊహించని పరిణామానికి ఆ మహిళా ఆటోడ్రైవర్ విస్మయానికి గురైంది. ఆనక తెరుకుని, మీరు తనతో ఫోటో దిగడం అన్నది నిజమా?కలా? అని నమితను అడిగింది. జీవితంలో నమ్మశక్యం కానిదేదీ లేదనీ, నమ్మకమే ప్రదానం అని నమిత ఆమెతో జీవిత సత్యాన్ని వివరించారు. ఆ మహిళ పేరు ధనలక్ష్మీ అని తెలుసుకుని కుటుంబ పోషణ కోసం ధైర్యంగా ఆటో నడుపుతున్న నీకు సెల్యూట్ అంటూ ఆమెకు బూస్ట్ తాగితే కలిగేంత శక్తిని ఉత్సాహాన్ని కలిగించి అక్కడ నుంచి బయలు దేరారు. నటి నమితా మజాకా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement