సాక్షి,తిరుమల: తమిళనాడులో జరగనున్న సాధారణ ఎన్నికల్లో మళ్లీ అమ్మ (జయలలిత) గె లుస్తుందని నటి నమిత ఆకాంక్షించారు. మంగళవారం ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ అమ్మ గెలవాలని శ్రీవారిని ప్రార్థించానన్నారు. కచ్చితంగా అమ్మే గెలుస్తుందని విజయానికి సంకేతంగా తన వేళ్లను నవ్వుతూ చూపిస్తూ స్పష్టం చేశారు.