సియాన్‌కు జోడీగా నయన | Nayanthara to pair up with Vikram? | Sakshi
Sakshi News home page

సియాన్‌కు జోడీగా నయన

Published Thu, Feb 19 2015 1:21 AM | Last Updated on Wed, Apr 3 2019 9:02 PM

Nayanthara to pair up with Vikram?

ఐ చిత్రంలో అద్భుత అభినయాన్ని శారీరక భాషను కనబరచి సినీ వర్గాలను, అభిమానులను అబ్బురపరచిన నటుడు సియాన్ విక్రమ్. ఆ చిత్రం తరువాత ఈయనకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే చిత్రాల ఎంపికలో ఆచి తూచి అడుగేస్తున్న విక్రమ్ ప్రస్తుతం యువ దర్శకుడు ఆనంద్ శంకర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. వ్యక్తిగతంగా పలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నా కెరీర్ పరంగా ప్రకాశిస్తున్న నయనతార తొలిసారిగా విక్రమ్‌తో జోడీ కట్టడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం.
 
 నయనతార ప్రేమ వ్యవహారంలో పరాజయం పొంది నటనకు దూరమై, ఆ తరువాత రీ ఎంట్రీలో కూడా తన స్థానాన్ని పదిల పరచుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అరడజను చిత్రాలు వున్నాయి. వీటిలో స్టార్ నటులు సూర్య నుంచి యువ నటుడు విజయ్ సేతుపతి, ఆది చిత్రాల వరకు ఉన్నాయి. విక్రమ్ ప్రభుతో అరిమా నంబి చిత్రం చేసి విజయం సాధించిన యువ దర్శకుడు ఆనంద్ శంకర్ క్రేజీ జంట విక్రమ్, నయనతారలతో భారీ యాక్షన్ ఓరియంటేషన్ చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం 10 ఎన్‌డ్రదుక్కుళ్ చిత్ర విడుదలకోసం ఎదురు చూస్తున్న విక్రమ్ నటించనున్న తదుపరి చిత్రం ఇదేఅవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement