కొత్త సంబరాలకు ముస్తాబు!
Published Mon, Dec 30 2013 4:13 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM
సాక్షి, చెన్నై: కొత్త సంవత్సర వేడుకలకు చెన్నై మహానగరంలోని హోటళ్లు, రిసార్ట్సులు, వినో ద కేంద్రాలు ముస్తాబవుతున్నాయి. అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటగానే, ఎక్కడి సంబరా లు అక్కడే ఆపాల్సిందేనని పోలీసు యంత్రాం గం హుకుం జారీ చేసింది. హద్దులు దాటినా, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పదని హెచ్చరించింది. నగరంలో భద్రత నిమిత్తం 18 వేల మందిని రంగంలో దించనున్నారు. ప్రతి ఏటా కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ రాష్ట్రంలో వేడుకలు కోలాహలంగా జరగడం పరిపాటే. ఆ కోవలోనే ఈ ఏడాది హోటళ్లు, రిసార్టులు, గార్డెన్లు, సముద్ర తీరాలు ముస్తాబవుతున్నాయి. కళ్లు చెదిరే లైటింగ్స్..ఒళ్లు మెరిసే కలర్స్.. చెవులు మార్మోగించే సంగీతం, విందుల పసందు, మద్యం హోరు...ఇలా కొత్త యేడాదికి స్వాగతం చెప్పేందుకు ఆయా హోటళ్లు, వినోద కేంద్రాలు పోటీపడి సింగారించుకుంటున్నాయి.
హోటళ్లు: కొత్త యేడాదిని పురస్కరించుకుని నగరంలోని స్టార్ హోటళ్లు పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహించనున్నాయి. మరో రోజు మాత్ర మే కొత్త సంవత్సర ఆహ్వానానికి సమయం ఉండటంతో కస్టమర్లను ఆకర్షించేందుకు భిన్నమైన స్వరాలను కలిపి ఉర్రూతలూగించే డీజేలను దిగుమతి చేసుకుంటున్నాయి. అర్ధరాత్రి వంటకాల మెనూను సిద్ధం చేస్తున్నాయి. జం టగా వచ్చినా, సింగిల్‌గా వచ్చినా ఎంజాయ్ చేయడమే పరమావధిగా స్టార్ హోటళ్లు పోటీ పడుతున్నాయి. నగరంలోని చెన్నై టీ నగర్ జీఎన్ చెట్టి రోడ్డులోని అకార్డ్ హోటల్, తిరుమ లై పిళ్లై వీధిలోని క్వాలిటీ ఇన్ శబరి, గిండిలోని హోటల్ లీ మెరీడియన్, ఐటీసీ చోళా, తిరువాన్మియూర్‌లోని హోటల్ లీ వాటెరినా, టీ నగర్‌లోని జీఆర్‌టీ, రెసిడెన్సీ టవర్స్, తేనాం పేటంలోని హోటల్ హయత్ రీజన్సీ, హోటల్ మేరి యట్, ఆళ్వార్ పేటలోని పార్క్ షెరటన్, రెయి న్ ట్రీ, అన్నా సాలైలోని తాజ్‌మౌంట్, ఎగ్మూర్‌లోని తాజ్ కన్నిమెర, నుంగంబాక్కం తాజ్ కోరమండల్, గిండిలోని ఐటీసీ టవర్ తదితర హోటళ్లు వేడుకలకు సిద్ధమవుతున్నాయి. మెరీనా: మెరీనా తీరంలోనూ ప్రతి ఏటా వేడుకలు అంబరాన్ని తాకుతాయి. ఇక్కడికి వేలాదిగా నగరవాసులు తరలివస్తారు. దీంతో ఆ పరిసరాల్లో రాత్రి 11 గంటల తర్వాత వాహనాల రాకపోకల్ని నిలిపివేయనున్నారు.
భద్రత: కొత్త సంవత్సరం భద్రత నిమిత్తం 18 వేల మందిని నగర పోలీసు యంత్రాంగం రంగంలోకి దించనున్నది. హోటళ్లలో ఆంక్షల ఉల్లంఘనల్ని పసిగట్టేందుకు ప్రత్యేక బృందాలు నిఘా పెట్టనున్నారుు. ఇందుకోసం అదనపు కమిషనర్లు రాజేష్ దాస్, తామరైకన్నన్ పర్యవేక్షణలో 50 బృందాలు నియమించనున్నారు. ఏదేని హోటళ్లు విచ్చలవిడితనాన్ని ప్రదర్శించిన పక్షంలో ఈ బృందం కొరడా ఝుళిపించనున్నది. అనేక ప్రధాన కూడళ్లల్లో భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు. మద్యానికి చిత్తైఅతిగా వ్యవహరించినా, మహిళలతో అసభ్య కరంగా వ్యవహరించినా వారి భరతం పట్టేందుకు మఫ్టీలో పోలీసులు విధుల్లోకి దిగనున్నారు. మద్యం తాగి వాహనాలను నడిపే వారి భరతం పట్టేందుకు నగర పోలీసులు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా ఈసీఆర్ రోడ్డులో నిఘాను పటిష్టం చేయనున్నారు. ప్రమాద రహిత సంబరాలు జరుపుకునేలా యువతకు అవగాహన కల్పించనున్నారు.
Advertisement
Advertisement