న్యూఢిల్లీ: మహిళలకు స్వయం ఉపాధి కల్పించేదిశగా జామియా మిల్లియా ఇస్లామియా ముందడుగు వేసింది. ఇందులో భాగంగా అందరూ మహిళలే భాగస్వాములుగా క్యాంటీన్‌ను ఏర్పాటుచేశారు. దీన్ని భారత ఉపరాష్ట్రపతి మహమ్మద్ హమిద్ అన్సారీ భార్య సల్మా అన్సారీ శుక్రవారం ప్రారంభించారు. జామియా సమీపంలో ఉన్న ఏక్తా అనే స్వయం సహాయక బృందం సభ్యులు దీన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సల్మా మాట్లాడుతూ.. జామియా చర్య అభినందనీయమన్నారు. మహిళలు సాధికారత సాధించిననాడే దేశం అభివృద్ధి చెందుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. జామియా మీడియా అనుసంధానకర్త ముఖేష్ రంజన్ మాట్లాడుతూ.. బృందం మహిళలకు తగిన శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. ఈ క్యాంటీన్‌లో సిబ్బంది మొత్తం మహిళలే ఉంటారని అన్నారు. కాగా, ఈ క్యాంటీన్‌లో వంటమనిషిగా చేరిన గుల్ష్మా మాట్లాడుతూ.. తాను క్యాటరింగ్ విషయంలో సాకేత్‌లో ఇప్పటికే కొంత శిక్షణ పొందానని తెలిపింది. ఇక్కడ పనిచేయడం ద్వారా తన కుటుంబ పోషణకు అవసరమైన సొమ్ము సంపాదించుకోవడానికి అవకాశం ఏర్పడిందని పేర్కొంది.
జామియాలో మహిళల క్యాంటీన్
Published Sun, Jan 18 2015 11:29 PM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM
Advertisement