salma ansari
-
తలాక్‌పై ఉపరాష్ట్రపతి సతీమణి కీలక వ్యాఖ్యలు
-
తలాక్‌పై ఉపరాష్ట్రపతి సతీమణి కీలక వ్యాఖ్యలు
అలీగఢ్: దేశవ్యాప్తంగా ట్రిపుల్ తలాక్‌పై తీవ్ర చర్చలు జరుగుతుండగా ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ భార్య సల్మా అన్సారీ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడుసార్లు తలాక్ అని చెప్పినంత మాత్రానా అది విడాకులుగా భావించరాదని చెప్పారు. 'ఒకరు తలాక్ తలాక్ తలాక్ అన్నంత మాత్రాన అది విడాకులు కాబోదు. ముస్లిం మహిళలకు ఈ సందర్భంగా ఓ విషయం చెబుతున్నాను. ఖురాన్ చదవండి. ముస్లిం మత పెద్దలు చెప్పేవాటినే పాటించడం కాకుండా ఖురాన్ చదివితే అందులో అసలు ఏముందనేది తెలుస్తోంది. చాలా మంది ముస్లిం మతపెద్దలు వారి భావాలే చెబుతుంటారు' అని కూడా సల్మా చెప్పారు. 'మౌలానాలు ఏం చెప్పిన మీరు నిజం అనుకుంటారు. అరబిక్‌లో ఉన్న ఖురాన్‌ను చదవండి. అనువాదాలను కాదు. అప్పుడే షారియత్ ఏం చెబుతోందో స్పష్టంగా తెలుస్తుంది. ఎవరో చెప్పినదానిని గుడ్డిగా పాటించడం కాదు' అని ఆమె వ్యాఖ్యానించారు. అలీఘడ్‌లోని అల్ నూర్ చారిటబుల్ సొసైటీ చాచా నెహ్రూ మదర్సాలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. -
'ఓం' అంటే తప్పేంటి?
న్యూఢిల్లీ: యోగాను వ్యతిరేకించడం సరికాదని ఉపరాష్ట్రపతి సతీమణి సల్మా అన్సారీ అన్నారు. యోగా చేయడం ఆరోగ్యానికి మంచిదేనని అభిప్రాయపడ్డారు. యోగాతో ఎముకల సమస్య నుంచి తాను ఉపశమనం పొందానని వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున 'ఓం' ఉచ్ఛరించడంతో తప్పేంలేదని పేర్కొన్నారు. మత సంబంధమైన పదాలు పలకడం లేదు కదా అని అన్నారు. అందరూ తప్పనిసరిగా యోగా చేయాలని ఆమె సూచించారు. యోగా దినోత్సవం (జూన్ 21) నాడు యోగా చేసే వారంతా 'ఓం' ఉచ్ఛరించాలని ఇటీవల ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచన చేసింది. దీనిపై మైనారిటీ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. -
జామియాలో మహిళల క్యాంటీన్
న్యూఢిల్లీ: మహిళలకు స్వయం ఉపాధి కల్పించేదిశగా జామియా మిల్లియా ఇస్లామియా ముందడుగు వేసింది. ఇందులో భాగంగా అందరూ మహిళలే భాగస్వాములుగా క్యాంటీన్‌ను ఏర్పాటుచేశారు. దీన్ని భారత ఉపరాష్ట్రపతి మహమ్మద్ హమిద్ అన్సారీ భార్య సల్మా అన్సారీ శుక్రవారం ప్రారంభించారు. జామియా సమీపంలో ఉన్న ఏక్తా అనే స్వయం సహాయక బృందం సభ్యులు దీన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సల్మా మాట్లాడుతూ.. జామియా చర్య అభినందనీయమన్నారు. మహిళలు సాధికారత సాధించిననాడే దేశం అభివృద్ధి చెందుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. జామియా మీడియా అనుసంధానకర్త ముఖేష్ రంజన్ మాట్లాడుతూ.. బృందం మహిళలకు తగిన శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. ఈ క్యాంటీన్లో సిబ్బంది మొత్తం మహిళలే ఉంటారని అన్నారు. కాగా, ఈ క్యాంటీన్లో వంటమనిషిగా చేరిన గుల్ష్మా మాట్లాడుతూ.. తాను క్యాటరింగ్ విషయంలో సాకేత్‌లో ఇప్పటికే కొంత శిక్షణ పొందానని తెలిపింది. ఇక్కడ పనిచేయడం ద్వారా తన కుటుంబ పోషణకు అవసరమైన సొమ్ము సంపాదించుకోవడానికి అవకాశం ఏర్పడిందని పేర్కొంది.