Jamia
-
‘జామియా’లో దీపావళి ఉద్రిక్తత
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని జామియా యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. దీపావళి వేడుకల సందర్భంగా రెండు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం యూనివర్శిటీకి చెందిన కొందరు హిందూ విద్యార్థులు దీపావళి వేడుకలకు ముందుగా దీపాలు వెలిగించారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన మరోవర్గానికి చెందినవారు నిరసనకు దిగారు. అనంతరం ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.ఈ నేపధ్యంలో యూనివర్సిటీ క్యాంపస్‌లో పోలీసు భద్రతను మరింతగా పెంచారు. జామియా యూనివర్సిటీలో దీపావళి వేడుకల సందర్భంగా వెలిగించిన దీపాలను పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యూనివర్శిటీలో మతపరమైన నినాదాలు వినిపించినట్లు పోలీసులు తెలిపారు. BIG BREAKING NEWS 🚨 Clash breaks out at Jamia Millia Islamia University during Diwali celebrations of Hindus.Conflict began when some individuals allegedly tried to erase off Rangoli with their feet & extinguish Diyas.Viral Video claims some students were raising… pic.twitter.com/Kg4tf9eA2k— Times Algebra (@TimesAlgebraIND) October 22, 2024ఇది కూడా చదవండి: కొనసాగుతున్న బాంబు బెదిరింపులు -
జేఎన్‌యూ విద్యార్థి నేతల విడుదల
న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో అరెస్టై గత సంవత్సర కాలంగా జైళ్లో ఉన్న జేఎన్‌యూ విద్యార్థులు నటాషా నర్వాల్, దేవాంగన కలీతా, జామియా మిలియా విద్యార్థి ఆసిఫ్ ఇక్బాల్ తాన్హా గురువారం బెయిల్‌పై తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. తక్షణమే వారిని విడుదల చేయాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు వారిని విడుదల చేశారు. రెండు రోజుల క్రితమే హైకోర్టు వారిద్దరితో పాటు ఆసిఫ్ తాన్హాకు బెయిల్ మంజూరు చేసింది. వారి పూచీకత్తులను పరిశీలించడంలో జాప్యం జరగడంతో వారిని విడుదల చేయడం ఆలస్యమైంది. ఈ ముగ్గురు విద్యార్థి నేతలను గత సంవత్సరం మేలో ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం( యూఏపీఏ– ఉపా)’ కింద అరెస్ట్ చేశారు. వెరిఫికేషన్‌లో జాప్యం వారి విడుదలను నిరోధించడానికి సరైన కారణం కాదని గురువారం నాటి ఆదేశాల్లో హైకోర్టు మండిపడింది. బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం ఢిల్లీ హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన తరువాత ముగ్గురు నిందితులు తమను విడుదల చేస్తూ ఆదేశాలివ్వాలని కోరుతూ విచారణ కోర్టును ఆశ్రయించారు. అయితే, వారి పిటిషన్‌ను విచారణ కోర్టు గురువారానికి వాయిదా వేయడంతో వారు మళ్లీ హైకోర్టుకు వెళ్లారు. దాంతో హైకోర్టు వారిని తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. విచారణ కోర్టు తీరును తప్పుబడుతూ ఈ అంశాన్ని వెంటనే, వేగంగా చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన అల్లర్లకు కుట్ర చేశారన్న ఆరోపణలపై వారిని అరెస్ట్ చేశారు. ఆ అల్లర్లలో 53 మంది చనిపోగా, 200 మందికి పైగా గాయపడ్డారు. ఆ ముగ్గురు విద్యార్థి నేతలకు మంగళవారం బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వ్యతిరేకతను అణచాలన్న అత్యుత్సాహంతో నిరసన తెలిపే హక్కుకు, ఉగ్ర చర్యలకు మధ్య ఉన్న రేఖను ప్రభుత్వం విస్మరించిందని హైకోర్టు నాడు పేర్కొంది. కాగా, ఆ విద్యార్థినేతలకు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. చదవండి: దేశద్రోహం కేసులో ఆయేషాకు బెయిల్ -
విద్యార్థులపై తూటాలు పేలుస్తున్నారి: ఓవైసీ
-
విద్యార్థులపై హింస: స్పందించిన సుప్రీం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ, ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ యూనివర్సిటీలో పోలీసులు విద్యార్థులపై దాడి చేసిన అంశంపై సుమోటోగా విచారణ చేపట్టాలన్న అభ్యర్థనపై సుప్రీంకోర్టు స్పందించింది. మొదట అల్లర్లు ఆగిపోయి.. శాంతి నెలకొల్పాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే స్పష్టం చేశారు. ఈ అంశంపై మంగళవారం వాదనలు వింటామని ఆయన స్పష్టం చేశారు. ‘మొదట అల్లర్లు ఆగాలని మేం కోరుకుంటున్నాం. అలర్లు ఎలా జరుగుతున్నాయో మాకు తెలుసు. ఇలాంటి వాతావరణంలో మేం ఎలాంటి నిర్ణయం తీసుకోలేం. ముందు ఇది ఆగాలి’ అని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సందర్భంగా జామియా, అలీగఢ్ యూనివర్సిటీల్లో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని న్యాయవాదులు ఇందిరా జైసింగ్, కోలిన్ గోన్సాల్వే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రిటైర్డ్ న్యాయమూర్తులను ఆ రెండు యూనివర్సిటీలకు పంపి.. విద్యార్థులపై జరిగిన హింస పట్ల దర్యాప్తు జరిపి నిజానిజాలు వెలికితీయాలని కోరారు. ‘ఎందుకు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు? బస్సులను తగులబెడుతున్నారు. శాంతియుత వాతావరణం నెలకొన్న తర్వాతే ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటాం. అల్లర్లు చేస్తున్నవారు వెంటనే వాటిని ఆపాలి’ అని జస్టిస్ బాబ్డే పేర్కొన్నారు. -
మోదీపై నిప్పులు చెరిగిన ప్రియాంకగాంధీ
న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఆందోళనలు తీవ్రతరమైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకగాంధీ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రజల గొంతును వినేందుకు కేంద్రం భయపడుతోందని, అందుకే విద్యార్థులను, జర్నలిస్టులను అణచివేయడం ద్వారా తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. యువత ధైర్యాన్ని, గొంతును అణచివేసేందుకు నరేంద్రమోదీ సర్కార్ నిరంకుశంగా ప్రవర్తించాలని చూస్తోందని, కానీ, ఒకనాటికి యువత గళాన్ని కేంద్రం వినకతప్పదని ఆమె హెచ్చరించారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విద్యార్థుల ఆందోళనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ఆదివారం రాత్రి ఆమె ట్విటర్లో మోదీ సర్కార్‌పై మండిపడ్డారు. ‘దేశంలోని యూనివర్సిటీల్లోకి ప్రవేశించి విద్యార్థులను కొడుతున్నారు. ప్రజలు గొంతు వినాల్సిన సమయంలో బీజేపీ సర్కారు విద్యార్థులు, జర్నలిస్టుల అణచివేత ద్వారా ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది పిరికిపంద ప్రభుత్వం’ అని ఆమె విమర్శించారు. ‘మోదీజీ భారతీయ యువత గళాన్ని వినండి. వారి గొంతును మీరు అణచివేయలేరు. ఎప్పటికైనా మీరు వినాల్సిన పరిస్థితి వస్తుంది’ అని ఆమె పేర్కొన్నారు. చదవండి: చేతులు పైకెత్తమన్నారు.. నేరస్తుల్లా చూశారు! -
చేతులు పైకెత్తమన్నారు.. నేరస్తుల్లా చూశారు!
న్యూఢిల్లీ: చేతులు పైకెత్తి క్యాంపస్ నుంచి బయటకు వెళ్లిపోవాలంటూ పోలీసులు మమ్మల్ని ఆదేశించారు. నిజానికి మేం ఆందోళనలు జరిగిన ప్రదేశానికి వెళ్లలేదు. ఆ సమయంలో క్యాంపస్‌లో ఉన్నాం. అయినా పోలీసులు మమ్మల్ని నేరస్తుల్లా చూశారు.. ఇది జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థిని ఆవేదన. పోలీసులు క్యాంపస్‌లోకి ప్రవేశించి మరీ తమను చితకబాదారని, తమను నేరస్తుల్లా చూశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థినులని చూడకుండా మగపోలీసులు తమను నెట్టేశారని, తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని, ఆ సమయంలో మహిళా పోలీసులు కూడా లేరని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులు ఆదివారం సాయంత్రం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళన హింసాత్మకంగా మారింది. ఈ ఆందోళనలో విద్యార్థులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహా సుమారు 40 మంది గాయపడ్డారు. దక్షిణ ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో ఆందోళనకారులు నాలుగు బస్సులు, రెండు పోలీసు వాహనాలు దగ్ధం చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ క్రమంలో ఆందోళనకారులు జెఎంఐ యూనివర్సిటీ క్యాంపస్‌లోకి చొరబడటంతో బలగాలు కూడా క్యాంపస్‌లోకి వెళ్లాయి. ఈ క్రమంలో పోలీసు బలగాలు తమను పట్ల దురుసుగా ప్రవర్తించాయని, కనీసం క్యాంపస్ పరిధిలో ఉన్న మసీదులో ప్రార్థనలు చేసుకోవడానికి కూడా అనుమతించలేదని, తమ లైబ్రరీ, క్యాంటీన్‌ను ధ్వంసం చేశాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. హింసాత్మక ఆందోళనల నేపథ్యంలో జెఎంఐని వచ్చే నెల 5వ తేదీ వరకు సెలవులు ప్రకటించి.. విద్యార్థులను ఇంటికి పంపించేశారు. చదవండి: గదుల్లోకి చొరబడి మరీ కొట్టారు.. -
హాకీ ప్లేయర్ అనుమానాస్పద మృతి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ఓ కాలేజీ విద్యార్థి అనుమానాస్పద మరణం కలకలం రేపింది. దక్షిణ ఢిల్లీలోని సరోజినీ నగర్లో తన సొంత కారులో చనిపోయి ఉన్నాడు. జామి మిల్లియా ఇస్లామియా కాలేజీలో బీఏ చదువుతున్నా రిజ్వాన్‌ఖాన్(22) స్టేట్ లెవల్ హాకీ క్రీడాకారుడు కూడా. హతుడి కుడిచేతికి బుల్లెట్ గాయాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే రిజ్వాన్ ది హత్యా, ఆత్మహత్యా అనేది ఇంకా తేలాల్సి వుంది. ప్రేమ వ్యవహారమే కారణమా అనే సందేహాలను పోలీసులు వ్యక్తం చేశారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రోమిల్ బానియా రిపోర్ట్ ప్రకారం రిజ్వాన్‌ఖాన్ సుభాష్ నగర్ నివాసి. బైక్ కొనుక్కుంటానని చెప్పి సోమవారం సాయంత్రం రిజ్వాన్ ఇంటినుంచి రూ.2 లక్షలు తీసుకొని వెళ్లాడు. రాత్రి ఇంటికి రాలేదు. మొబైల్ స్విచ్ ఆఫ్ లో వుంది ఇంతలో, మంగళవారం ఉదయం10.30 గంటలకు ఎవరో ఫోన్ చేసి రిజ్వాన్‌బ్యాగ్ తమ దగ్గర ఉందని వచ్చి తీసుకెళ్లమని చెప్పారని రిజ్వాన్ తండ్రి చెప్పారు. వెంటనే అక్కడికి వెళ్లామనీ, స్విఫ్ట్ కారు పార్క్ చేసి ఉండడాన్నిగమనించి , పరిశీలించగా రక్తపు మడుగులో పడివున్న రిజ్వాన్ మృతదేహాన్ని గుర్తించామని తెలిపారు. రిహ్వాన్ రోహతాక్లోని కళాశాలలో చదువుతున్న ఓ అమ్మాయితో మహిళతో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమెను కలవడానికి వెళ్లాడని, అయితే ఆమె ఒడిషా వెళ్లడంతో రాత్రంతా కారులో కూర్చున్నాడని పోలీసులు చెప్పారు. ఆమెను సంప్రదించడానికి ప్రయత్నించినట్లు, పలుమార్లు ఆమెకు ఫోన్ చేసినట్టు గుర్తించామని తెలిపారు. దేశపు తుపాకీ,, రూ.2 లక్షలు నగదు, మొబైల్ ఫోన్‌తోపాటు అమ్మాయి ఫోటో కూడా ఉన్న బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. ఎలాంటి సూసైట్‌నోట్ లభించలేదని విచారణ నిర్వహిస్తున్నాని చెప్పారు అయితే అమ్మాయి తరపువారే తమ కుమారుడిని హత్య చేసి వుంటారని రిజ్వాన్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. -
జామియాలో మహిళల క్యాంటీన్
న్యూఢిల్లీ: మహిళలకు స్వయం ఉపాధి కల్పించేదిశగా జామియా మిల్లియా ఇస్లామియా ముందడుగు వేసింది. ఇందులో భాగంగా అందరూ మహిళలే భాగస్వాములుగా క్యాంటీన్‌ను ఏర్పాటుచేశారు. దీన్ని భారత ఉపరాష్ట్రపతి మహమ్మద్ హమిద్ అన్సారీ భార్య సల్మా అన్సారీ శుక్రవారం ప్రారంభించారు. జామియా సమీపంలో ఉన్న ఏక్తా అనే స్వయం సహాయక బృందం సభ్యులు దీన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సల్మా మాట్లాడుతూ.. జామియా చర్య అభినందనీయమన్నారు. మహిళలు సాధికారత సాధించిననాడే దేశం అభివృద్ధి చెందుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. జామియా మీడియా అనుసంధానకర్త ముఖేష్ రంజన్ మాట్లాడుతూ.. బృందం మహిళలకు తగిన శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. ఈ క్యాంటీన్లో సిబ్బంది మొత్తం మహిళలే ఉంటారని అన్నారు. కాగా, ఈ క్యాంటీన్లో వంటమనిషిగా చేరిన గుల్ష్మా మాట్లాడుతూ.. తాను క్యాటరింగ్ విషయంలో సాకేత్‌లో ఇప్పటికే కొంత శిక్షణ పొందానని తెలిపింది. ఇక్కడ పనిచేయడం ద్వారా తన కుటుంబ పోషణకు అవసరమైన సొమ్ము సంపాదించుకోవడానికి అవకాశం ఏర్పడిందని పేర్కొంది.