
మహిళా ఎస్పీ కేసులో నిందితుడి అరెస్ట్
సాక్షి ప్రతినిధి, చెన్నై: కరూరు జిల్లా మహిళా ఎస్పీ వందితా పాండేను హతమార్చేందుకు పథకం పన్నిన కేసులో వెంకటేష్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కరూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి సోమవారం సాయంత్రం పరుగు పరుగున వచ్చి ఎస్పీగారిని వెంటనే చూడాలని వచ్చిన వ్యక్తినే అనుమానితుడిగా పోలీసులు భావిస్తున్నారు. ఎస్పీని హత్య చేస్తే తనకు రూ.10 లక్షలు ఇస్తానని ఇద్దరు అగంతకులు తనను మభ్యపెట్టగా భయంతో ఎస్పీ కార్యాలయానికి వచ్చానని కరూరు జిల్లా పరమద్ది గ్రామానికి చెందిన వెంకటేశన్ (54) అనే అతను చెప్పడాన్ని పోలీసులు అనుమానిస్తున్నారు. అతను తెచ్చిన బ్యాగులోని తుపాకీ, తూటాలను స్వాధీనం చేసుకుని వెంకటేశన్‌ను అరెస్ట్ చేసినట్లు బుధవారం పోలీసులు తెలిపారు.