న్యూఢిల్లీ : నగరంలో అమ్మాయిల అక్రమ రవాణాను అరికట్టడంలో ఢిల్లీ పోలీస్ క్రైంబ్రాంచ్ విభాగం శెభాస్ అనిపించుకొంటోంది. నగరంలో అమ్మాయిల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడానికి ‘మానవుల అక్రమ రవాణా వ్యతిరేక యూనిట్(ఏహెచ్‌టీయూ)ను ప్రారంభించింది. ఈ యూనిట్ ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ మిలాప్’ నిర్వహిస్తున్నారు. అక్రమార్కుల చెర నుంచి అమ్మాయిలను, తప్పిపోయిన చిన్నారులను రక్షించి వారి కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించడేమే ఈ ఆపరేషన్ ధ్యేయం. తాజాగా 17 ఏళ్ల బాలికను కాపాడారు. ఆమెను దక్షిణ ఢిల్లీ మాదన్‌పూర్ దాబాస్ ప్రాంతంలోని ఆశ్రయ ఫ్యామిలీ హోంలో ఉంచారు. ఈ మేరకు క్రైంబ్రాంచ్ పోలీసులు ఆమెను విచారించారు. పలు విషయాలను ఆమె పోలీసులకు వివరించింది.
‘తాను పంజాబ్‌లోని లూథియాకు చెందినట్లు, తమది పేద కుటుంబమని బాధిత బాలిక పోలీసులకు వివరించింది. బెలూన్లను విక్రయిస్తానని చెప్పింది. సెప్టెంబర్‌లో రింకూ అనే వ్యక్తి ఆమెను ఢిల్లీకి తీసుకొచ్చి పశ్చిమ ఢిఈల్లోని భావనా ప్రాంతంలో ఉంచారు. రింకూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. పదిరోజులుగా కనిపించకుండా పోయాడు. తర్వాత బాధితురాలును పోలీసులు గుర్తించి సెప్టెంబర్ 17న చిల్డ్రన్స్‌హోం కు తరలించారు.‘ ప్రస్తుతం భయాందోళనలో ఉన్న బాలిక క్రైంబ్రాంచ్ పోలీసు బృందానికి ప్రాథమిక సమాచారం మాత్రమే చెప్పింది. ఇంకాపూర్తి వివరాలు తెలియజేయలేదు. ఈ మేరకు బాలిక వెంట తీసుకొని లూథియానుకు వెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు క్రైంబ్రాంచ్ అధికారులు చెప్పారు. ఆపరేషన్ మిలాప్ లో ఇంతకు ముందు ఇద్దరు చిన్నారులను రక్షించారు. వారిని పశ్చిమ ఢిల్లీలోని ప్రహ్లాదపూర్ బంగర్‌లోని చిల్డ్రన్స్‌హోంలో ఉంచారు.
చిల్డ్రన్స్ హోమ్స్ పరిశీలన
డిసెంబర్ 18వ తేదీన ‘ఆపరేషన్ మిలాప్’ను ఢిల్లీ పోలీసులు ప్రారంభించారు. నగరంలో అన్ని చిల్డ్రన్స్‌హోంలను సందర్శించి రికార్డులను పరిశీలిస్తున్నారు. కిడ్నాప్‌నకు గురైన, తప్పిపోయిన వారి జాబితాలను ఆయా హోంల్లో పరిశీలిస్తున్నారు. ఈ ఏహెచ్‌టీయూలో ఐదు పోలీసుల బృందాలున్నాయి. ప్రభుత్వ చిల్డ్రన్స్ వెల్ఫేర్ కమిటీ(సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో నగరంలోని 96 చిల్డ్రన్స్ హోంలను పరిశీలిస్తుంది. అక్కడ ఉంటున్న చిన్నారులకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుంది. ఏ మాత్రం క్లూ దొరికినా వారిని చేరదీసి కుటుంబ సభ్యులకు అప్పగిస్తోందని జాయింట్ పోలీస్ కమిషనర్(క్రైంబ్రాంచ్) రవీంద్ర యాదవ్ చెప్పారు. అదేవిధంగా నగరంలోని ప్రార్థనా స్థలాలు, పార్కింగ్‌లు, రైలే ్వస్టేషన్లు, రోడ్లపై ఉండే చిన్నారుల ఫోటోలతో సహా, వివరాలను పోలీసులు సేకరిస్తారు. ఇందుకు సంబంధించిన లఘుసమాచారాన్నిపూర్తి చేస్తారు. తప్పిపోయిన చిన్నారుల సమాచారాన్ని పోల్చి చూసి, ఆధారాలు లభిస్తే, వారి కుటుంబ సభ్యులకు అందజేయడమే ధ్యేయంగా ముందుకుసాగుతున్నారు. ఉన్నతాధికారులు, బాధిత కుటుంబ సభ్యుల ప్రశంసలను ‘ఆపరేషన్ మిలాప్’ అందుకోంటుంది.
నగరంలో ‘ఆపరేషన్ మిలాప్’
Published Tue, Dec 23 2014 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 6:35 PM
Advertisement
Advertisement