ముంబై: క్రికెట్‌కు రాజకీయ నాయకులు దూరంగా ఉండాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. క్రికెట్ ఆడుతున్న 11 దేశాల్లో మాదిరిగానే ఇక్కడా కూడా వ్యవహరిస్తే బాగుంటుందని గురువారం ప్రచురితమైన పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో వ్యాఖ్యానించారు. ‘11 దేశాల్లో క్రికెట్ ఆడుతున్నారు. బ్రిటన్ రాజు ప్రిన్స్ చార్లెస్ ఏనాడు ఇంగ్లండ్ క్రికెట్ కౌన్సిల్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించలేదు. శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలోనూ రాజకీయ నాయకులు క్రికెట్‌కు దూరంగా ఉన్నార’ని ఆయన గుర్తు చేశారు.
ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) అధ్యక్ష పదవి కోసం శరద్ పవార్, గోపీనాథ్ ముండేల పోరు నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సాంకేతిక కారణాలతో ముండే దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను ఎంసీఏ తిరస్కరించడంతో పవార్ ఆ పదవికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీన్ని సవాల్ చేస్తూ ముండే స్థానిక కోర్టును ఆశ్రయించగా వారం పాటు ఎంసీఏ విధులకు దూరంగా ఉండేలా పవార్‌ను ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆటల అభివృద్ధి కోసం రాజకీయ నాయకులు దూరంగా ఉండాలని ఉద్ధవ్ సలహా ఇచ్చారు.
అనేక ప్రజా సమస్యలు మరుస్తున్న మన రాజకీయ నాయకులు క్రికెట్ గురించి రాజకీయ ఆటలు ఆడటంలో తప్పులేదని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ప్రధానిమంత్రి కావాలనే కోరిక ఉన్న పవార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న ముండే ఎంసీఏ అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు పోరాడుతున్నారనితెలిపారు. గేమ్స్ గవర్నింగ్ బాడీల్లో చోటుదొరికితే అన్ని సమస్యలు పరిష్కారమైనట్టు నేతలు ఆలోచిస్తున్నారని ఛలోక్తి విసిరారు. ఆ రకంగా వారు క్రికెట్‌కు మంత్రముగ్ధులవుతున్నారని వివరించారు. ఆటగా క్రికెట్‌ను రాజకీయ నాయకులు అభిమానించాలన్నారు. దివంగత శివసేన అధ్యక్షుడు బాల్‌ఠాక్రే మాదిరిగా వ్యవహరించాలని సూచించారు. క్రికెట్ నుంచి సచిన్ టెండూల్కర్ రిటైర్డ్ అయ్యాడు. క్రికెట్ అభివృద్ధి కోసం ఆ గేమ్‌లోని రాజకీయాల నుంచి రాజకీయ నాయకులు తప్పుకోవాల్సిన సమయం ఇదేనని వ్యాఖ్యానించారు.
క్రికెట్ నుంచి తప్పుకోండి
Published Fri, Nov 29 2013 2:27 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM
Advertisement
Advertisement