నేడు పోలింగ్ | Polling today | Sakshi
Sakshi News home page

నేడు పోలింగ్

Published Thu, Aug 21 2014 1:53 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

నేడు పోలింగ్ - Sakshi

నేడు పోలింగ్

  •    మూడు నియోజకవర్గాల్లోనూ భారీ భద్రత
  •   బరిలో 22 మంది అభ్యర్థులు
  •   చిక్కొడి స్థానంలో అత్యధికంగా తొమ్మిది మంది
  •   మూడింటిలోనూ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ
  •   25న ఫలితాల వెల్లడి
  • సాక్షి, బెంగళూరు :  ఉప ఎన్నికలు ఆఖరు ఘట్టానికి చేరుకున్నాయి. గురువారం ఉదయం ఏడుగంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సాయంత్రం ఆరు గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. బళ్లారి గ్రామీణ, శికారిపుర, చిక్కొడి- సదలగ నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో మొత్తం 22 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

    అత్యధికంగా చిక్కొడి స్థానంలో తొమ్మిది తమ భవితవ్యాన్ని పరీక్షంచుకుంటున్నారు. అయితే మూడు నియోజకవర్గాల్లోనూ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధానపోటీ నెలకొని ఉంది. ఫలితాలు ఈ నెల 25న వెలువడనున్నాయి. పోలింగ్ సందర్భంగా మూడు నియోజకవర్గాల్లోనూ మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement