‘ఆ ఒక్కటి తప్ప..ఏదీ నెరవేరలేదు’ | Prabhakar ponnam comments on KCR | Sakshi
Sakshi News home page

‘ఆ ఒక్కటి తప్ప..ఏదీ నెరవేరలేదు’

Published Thu, Oct 13 2016 1:12 PM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM

Prabhakar ponnam comments on KCR

 పింఛన్లు మంజూరు తప్ప.. కేసీఆర్ ఇచ్చిన ఎన్నికల హామీలేవీ అమలు కాలేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో కేసీఆర్ హామీ ఇచ్చినట్లుగా కరీంనగర్‌కు ముందుగా మెడికల్ కాలేజీ ఇచ్చాకనే సిద్దిపేటలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్‌కు అద్దం తునకలా చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు అద్దం మరిచి తునకలుతునకలు చేశారని ఎద్దేవా చేశారు. కొత్త జిల్లాల ప్రారంభోత్సవానికి పార్టీలు, ఉద్యమకారులకు ఆహ్వానమే పంపలేదని ఆరోపించారు. ఎస్పీలకు బదులుగా కమిషనరేట్ల ఏర్పాటుతో ప్రజలకు ఒరిగేదేమిటని ప్రశ్నించారు. కొత్త జిల్లాల్లో ఏం పనులు చేయబోతున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement