నేడు రాష్ట్రపతి చెన్నై రాక | pranab mukherjee coming to chennai today | Sakshi
Sakshi News home page

నేడు రాష్ట్రపతి చెన్నై రాక

Published Fri, Dec 20 2013 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM

pranab mukherjee coming to chennai today

 టీ,నగర్, న్యూస్‌లైన్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం చెన్నైకు రానున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకుంటున్న ఆయన, అక్కడి నుంచి ఎంఆర్‌సీ నగర్ లీలం ప్యాలెస్ నక్షత్ర హోటల్‌లో జరిగే ఇంజినీర్ల సదస్సులో పాల్గొననున్నారు. తర్వాత ఒంటి గంటకు అక్కడి నుంచి బయలుదేరి నుంగంబాక్కం లయోలా కళాశాలకు చేరుకుని కొత్త భవనాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2.30గంటల సమయంలో కార్యక్రమాలు ముగించుకుని విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళతారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాక సందర్భంగా ఆయన వెళ్లే మార్గాలలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు అడిషనల్ కమిషనర్లు, ఏడుగురు జాయింట్ కమిషనర్లు, 11 మంది డెప్యూటీ కమిషనర్లు సహా 3,500 మంది భద్రతా విధుల్లో నిమగ్నమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement