సాక్షి, టీ.నగర్: నటుడు రజనీకాంత్ మరో రెండు నెలల్లో పార్టీ ప్రారంభించనున్నందున ఢిల్లీ ప్రధాన ఎన్నికల కమిషన్‌లో రజనీ తరఫున దరఖాస్తు ఫారం తీసుకున్నట్లు సమాచారం. రజనీకాంత్ మరో రెండు నెలల్లో పార్టీ ప్రారంభించనున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. గురువారం మండ్రం కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఇలావుండగా ఢిల్లీ ఎన్నికల కమిషన్‌లో ఆయన మండ్రం తరఫున దరఖాస్తు పిటిషన్ అందుకున్నట్లు సమాచారం. నటుడు రజనీకాంత్ రాజకీయ పార్టీ ప్రారంభించే పనిలో తలమునకలై ఉన్నారు. ఓ విషయంలో మోసపోయా: రజనీకాంత్
ఇందుకోసం గురువారం మండ్రం కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత నివాసానికి వెళుతున్న రజనీకాంత్ అక్కడున్న విలేకరులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయన రాజకీయాలలో తీవ్రంగా నిమగ్నమయ్యేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. దీనికి తగిన విధంగా ఢిల్లీలోని ప్రధాన ఎన్నికల కమిషన్‌లో రజనీ తరఫున దరఖాస్తు ఫారం తీసుకున్నట్లు సమాచారం అందింది. ఒకరు కొత్త పార్టీ ప్రారంభించడానికి మునుపు దాన్ని రాజకీయ పార్టీగా రిజిస్టర్ చేయాలనుకుంటే ఎన్నికల కమిషన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఈ దరఖాస్తు తీసుకున్నట్టు సమాచారం. పార్టీ పేరు ప్రకటించగానే, ఈ ఫారాన్ని పూర్తి చేసి అందజేయనున్నారు. పార్టీ విధి విధానాలు ప్రకటిస్తారు. కమల్ థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం
Comments
Please login to add a commentAdd a comment