జైలుకు వెళ్లడానికి రెడీ | Ready to face course of law: Simbu | Sakshi
Sakshi News home page

జైలుకు వెళ్లడానికి రెడీ

Published Thu, Dec 17 2015 8:14 AM | Last Updated on Fri, Aug 17 2018 2:27 PM

జైలుకు వెళ్లడానికి రెడీ - Sakshi

జైలుకు వెళ్లడానికి రెడీ

చెన్నై : జైలుకు వెళ్లడానికి రెడీ అంటున్నారు నటుడు శింబు. సంచలన నటుడు శింబు మరోసారి కోలీవుడ్‌లో కలకలానికి కేంద్రబందువుగా మారారు. ఆయన కాలక్షేపానికి రాసి పాడిన ఒక పాట తనను కష్టాల్లోకి నెట్టేలా చేసింది. అసభ్య పదజాలాలతో కూడి న ఆ పాట మహిళా లోకానికి ఆగ్రహాన్ని తెప్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు ఆందోళనకు దిగా యి. పోలీస్‌లకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొందరు శింబు ఇంటి ని చుట్టు ముట్టి ఆందోళనలు చేస్తున్నా రు.
 
మరో పక్క కోవై పోలీసులు అరెస్ట్ వారెంటు చేతిలో పెట్టుకుని చెన్నై చేరుకుని శింబు కోసం వేట మొదలెట్టారు. మరో విషయం ఏమిటంటే నటుడు శింబు అజ్ఞాతంలోకి వెళ్లారనే ప్రచారం జోరందుకుంది. తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు మెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీంతో శింబు ఎట్టకేలకు స్పందించారు. తాను అజ్ఞాతంలోకి వెళ్లలేదని,అసలు తమిళనాడు వదిలి వెళ్లలేదని పేర్కొన్నారు.
 
అదేవిధంగా తాను ఎలాంటి తప్పు చేయలేదు. చట్టం తన పని తాను చేసుకుంటుంది. చట్టపరంగా జైలుకు వెళ్ల డానికి కూడా తాను సిద్ధమే అన్నారు. ఈ నెల 19న శింబు,సంగీత దర్శకుడు అనిరుద్‌లు కోవై పోలీస్ స్టేషన్‌లో హాజరవ్వాల్సిందిగా పోలీసులు ఇప్పటికే సమన్లు జారీ చేసిన నేపథ్యంలో శింబు హాజరవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

కెనడాలో ఉన్న అనిరుద్ మంగళవారం చెన్నైకి తిరిగి వచ్చినట్లు కొందరు అంటున్నారు. మొత్తం మీద శింబు,అనిరుద్‌ల వ్యవహారం చిత్రపరిశ్రమలోనే కాకుండా,తమిళనాడు మొత్తం ప్రకంపనలు పుట్టిస్తోందన్నది నిజం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement