వైశ్యా బ్యాంక్‌లో చోరీకి విఫలయత్నం | robbery attempt in vysya bank in karimnagar | Sakshi

వైశ్యా బ్యాంక్‌లో చోరీకి విఫలయత్నం

Sep 26 2016 1:49 PM | Updated on Aug 30 2018 5:24 PM

కరీంనగర్ జిల్లాలోని వైశ్యా బ్యాంక్‌లో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి యత్నించారు.

కమలాపూర్: కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని వైశ్యా బ్యాంక్‌లో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి యత్నించారు. బ్యాంక్ తాళాలు పగలగొట్టి లోనికి చొరబడ్డ దొంగలు చోరీకి ప్రయత్నించారు. అది సాధ్యపడక పోవడంతో.. సమీపంలోని మూడు షాపుల తాళాలు పగలగొట్టి అందులో ఉన్న విలువైన వస్తువులతో పాటు రూ. 30 వేల నగదు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement