
‘పన్నీర్ సెల్వంకు అండగా ఉన్నాననే..’
చెన్నై: శశికళకు వ్యతిరేకంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు మద్దతు పలికినందుకే తనను తొలగించారని అన్నాడీఎంకే ఐటీ విభాగం కార్యదర్శి పదవి నుంచి ఉద్వాసనకు గురైన జి. రామచంద్రన్ ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తనకు దివంగత నాయకురాలు జయలలిత పార్టీలో పదవి ఇచ్చారని వెల్లడించారు.
తన స్థానంలో ఐటీ విభాగం కార్యదర్శిగా నియమితులైన వీవీఆర్ రాజ్ సత్యయాన్ కు అభినందనలు తెలిపారు. ‘అమ్మ’ వేసిన బాటలో పనిచేస్తానని స్పష్టం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో రామచంద్రన్ ను పదవి నుంచి తప్పించారు.