పాదిరివేడులో సమైక్యాంధ్ర ర్యాలీ
Published Mon, Sep 30 2013 4:24 AM | Last Updated on Fri, Sep 1 2017 11:10 PM
గుమ్మిడిపూండి, న్యూస్‌లైన్ : ఆంధ్ర రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరు తూ ఆదివారం గుమ్మడిపూండి యూనియన్ పాదిరి వేడులో దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ప్రభుత్వ మహోన్నత పాఠశాల నుంచి పాదిరివేడు బస్టాండు మీదుగా మాదరపాక్కం బస్టాండు వరకు సాగింది. దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఎం.మునిస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీట్ల కోసం తెలంగాణ విభజనకు అంగీ కారం తెలపడం దారుణమన్నారు.
ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు 60 రోజులుగా సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్నా కాంగ్రెస్‌లో కొంచెం కూడా చలనం లేకపోవడం సీమాంధ్రుల పట్ల వారికున్న సులకన భావం అర్థమవుతోందన్నారు. రాజకీయ నాయకులు పదవులు పట్టుకొని వేలాడుతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా కేంద్ర మంత్రులు, ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ మెడలు వంచాలని డిమాండ్ చేశారు.
ఈ ర్యాలీలో యూనియన్ మాజీ వైస్ చైర్మన్ త్యాగరాయ, యూనియన్ కౌన్సిలర్ కాంచన వీరభద్రం, దేవాంగ సంఘం కార్యదర్శి అశోక్ కుమార్, సంయుక్త కార్యదర్శులు చిట్టిబాబు, సత్యం బాబు, సత్యవేడు, జేఎంసీ సభ్యులు చొప్పల సోమశేఖర్, సత్యవేడు దేవాంగ సంఘం అధ్యక్షులు శివయ్య, తెలుగు వికాస సమితి సంయుక్త కార్యదర్శులు వి.కృష్ణమోహన్, షణ్ముగం పాల్గొన్నారు.
Advertisement