న్యూఢిల్లీ: ఢిల్లీలోని పాఠశాలల్లో నర్సరీ అడ్మిషన్ల వివాదంపై సత్వరమే విచారణ జరిపేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి పి. సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం ఈనెల 28 నాటికి ఈ కేసు విచారణను వాయిదా వేసింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని, డ్రా ద్వారా ఎంపికైన విద్యార్థులు చేరవచ్చన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను నిలిపివేస్తూ... న్యాయమూర్తులు హెచ్.ఎల్. దత్తు, ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం, ఢిల్లీ పాఠశాలల్లో నర్సరీ అడ్మిషన్లను నిలిపివేయాలని మరోసారి ఆదేశించింది.
పెద్ద ఎత్తున దుర్వినియోగమవుతుందోంటూ ఢిల్లీ ప్రభుత్వం అడ్మిషన్ల సమయంలో ఇంటర్‌స్టేట్ ట్రాన్స్‌ఫర్ (ఐఎస్‌టీ) కేటగిరీని తొలగించడంపై వివిధ రాష్ట్రాలనుంచి దేశరాజధానికి వచ్చిన తల్లిదండ్రులు చేసిన అప్పీలు మేరకు కోర్టు ఈ ఆదేశాలిచ్చింది.
ఫిబ్రవరి 27న ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల డ్రా ద్వారా తమ పిల్లలకు కేటాయించిన సీట్లు రద్దయ్యాయని ఐఎస్‌టీ తల్లిదండ్రులు తమ అభ్యర్థనలో పేర్కొన్నారు. గతంలో ఐఎస్‌టీ కేటగిరీకి 75 పాయింట్లుండేవి. ఏప్రిల్ 3 నాటి ఆదేశానుసారం గత ఏడాది డిసెంబర్ 18న విడుదలైన నోటిఫికేషన్‌లో 60శాతం సీట్లకు కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదని బాధితులు తెలిపారు. ఇటీవలి పాయింట్ సిస్టమ్ ద్వారా... 100 పాయింట్లలో చుట్టపక్కల నివసించేవారి పిల్లలకు 70పాయింట్లు, తమ తోబుట్టువులు చదువుతూ ఉంటే వారికి 20శాతం, తల్లిదండ్రులు కూడా అదే స్కూల్లో చదివిన పిల్లలకు 5పాయింట్లు పోగా, మిగిలిన ఐదు పాయింట్లను మాత్రమే ఐఎస్‌టీ కేటగిరీకి కేటాయించారు.
నర్సరీ అడ్మిషన్ల విచారణ 28న: సుప్రీం
Published Mon, Apr 21 2014 11:31 PM | Last Updated on Sat, Sep 2 2017 6:20 AM
Advertisement