సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య | Software engineer Aravind Kumar commits suicide in lodge | Sakshi

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

Published Fri, Aug 11 2017 6:07 PM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య - Sakshi

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

చెన్నైలోని ఓ లాడ్జి ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.

తమిళనాడు: చెన్నైలోని ఓ లాడ్జి ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని తొరైపక్కంలోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో అరవింద్‌కుమార్‌(25) పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం అరవింద్‌ తలుపులు తెరవకపోయేసరికి సిబ్బంది అనుమానంతో కిటికీలో నుంచి చూశారు. గదిలో ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీంతో నిర్వాహకులు స్థానిక  పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే అరవింద్‌ మృతి చెందాడు.  మృతుడి దగ్గర ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదని, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement