విద్యార్థి దశలోనే అవయవ దానంపై అవగాహన కల్పించాలి: ఎల్జీ | Spread awareness about organ donation in schools: Najeeb Jung | Sakshi
Sakshi News home page

విద్యార్థి దశలోనే అవయవ దానంపై అవగాహన కల్పించాలి: ఎల్జీ

Published Tue, Dec 2 2014 11:19 PM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM

Spread awareness about organ donation in schools: Najeeb Jung

 న్యూఢిల్లీ: అవయవదానంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఇక్కడ అవయమార్పిడి-అవగాహన సదస్సును ఆయన ప్రారంభించి ప్రసంగించారు. సున్నితమైన ఈ అంశంపై పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు అవగాహన కల్పించాలని, ఈ మేరకు పాఠ్యాంశాల్లో కూడా మార్పులు తీసుకొని రావాల్సిన అవసరం ఉన్నదని ఆయన సూచించారు. విద్యార్థులకు బాల్యం నుంచే అవయవదానం ఆవశ్యకతను తెలియజేయాలని అన్నారు. సదస్సులు, సమావేశాల ద్వారా అవయదానం విస్తృత ప్రచారం చేయాలని సదస్సుకు హాజరైన డాక్టర్లకు సూచించారు.  పుట్టిన రోజు, పండుగలు, ఇలా ఎన్నో సందర్భాల్లో అవయవదానంపై వివరించాలని అన్నారు. ‘అవయవ దానం గొప్పది. అవయాన్ని దానం చేయడం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు’ అనే సందేశాన్ని ఇవ్వాలని అన్నారు.
 
 ఈ సందర్భంగా ‘ఈ -రిపోర్టింగ్ పోర్టల్’ ప్రారంభించారు. ఎఐఐఎంఎస్ డెరైక్టర్ ఎంసీ మిశ్రా మాట్లాడుతూ భారత్‌లో అవయవదానంపై జీరో స్పందన ఉన్నదని 0.01శాతం ప్రజలు ముందుకొస్తున్నారని, పాశ్యాత్య దేశాల్లో 70-80 శాతం ప్రజలు అవయవాలను దానం చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారన్నారు. బ్రెయిన్ డెడ్ కేసుల్లో అవయదానానికి ఆయా కుటుంబాలు ముందుకురావాలని, అలా మరొకరి ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. ఇంకా పలువురు వైద్యులు మాట్లాడుతూ అవయదానం పట్ల ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలని, ఇందుకు చైతన్య కార్యక్రమాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని అన్నారు. అవయదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement