కన్నుల పండువగా శ్రీరామ పట్టాభిషేకం
Published Thu, Apr 6 2017 11:55 AM | Last Updated on Tue, Nov 6 2018 5:52 PM
భద్రాచలం: భద్రాద్రిలో శ్రీరాముడి మహాపట్టాభిషేక మహోత్సవం గురువారం ఉదయం కన‍్నులపండువగా జరిగింది. మిథిలా స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ దంపతులు, మంత్రి తుమ్మల నాగేశ్వరరరావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి పట్టాభిషేక కార్యక్రమాన్ని తిలకించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ భద్రాద్రి రాముడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గవర్నర్ నరసింహన్ దంపతులు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వేదపండితులు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు.
Advertisement
Advertisement