ఇప్పటికీ నా వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నా | Still, my comments were committed | Sakshi
Sakshi News home page

ఇప్పటికీ నా వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నా

Published Sun, Dec 7 2014 2:36 AM | Last Updated on Wed, Oct 17 2018 6:27 PM

ఇప్పటికీ నా వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నా - Sakshi

ఇప్పటికీ నా వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నా

బెంగళూరు : నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో తన అభిప్రాయానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రాధాన్యం ఇవ్వలేదంటూ చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నానని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీష్ పేర్కొన్నారు. శనివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ....ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి అభిప్రాయానికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంటుందని అన్నారు.

అయితే నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయమై తనకెలాంటి అసంతృప్తి లేదని, కాకపోతే ఈ విషయంలో ఒకసారి తన అభిప్రాయం కూడా తీసుకుని ఉంటే బాగుండేదనేది తన అభిప్రాయమని చెప్పారు. ఇక తన వ్యాఖ్యలపై సిద్ధరామయ్యతో పాటు కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్, మంత్రి ఆంజనేయ కూడా ప్రతి స్పందించారని, అయితే అవన్నీ వారి వారి భావాలని చెప్పుకొచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement