అందరూ చూస్తుండగానే...
వరద కాల్వలో దూకి వ్యక్తి ఆత్మహత్య
మల్యాల: ఓ గుర్తుతెలియని వ్యక్తి అందరూ చూస్తుండగానే వరద కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు అతడిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా మల్యాలలో జరిగింది. కరీంనగర్-జగిత్యాల రహదారిపై నూకపల్లి శివారులో నిండుగా ప్రవహిస్తున్న వరదకాల్వలో బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 50 ఏళ్ల వయస్సు గల ఓ వ్యక్తి దూకాడు. ఇది గమనించిన స్థానికులు, ప్రయూణికులు వెంటనే అతడిని కాపాడేందుకు ప్రయత్నించారు. సమీపంలోనున్న వైరును నీళ్లలో వేసినప్పటికీ అతడు అందుకోలేదు. కొంతదూరం ఈదుతూ వెళ్లిన వ్యక్తి ఆ తర్వాత నీటి లో మునుగుతూ తేలుతూ కొట్టుకుపోయూడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్వాపూర్ గ్రామశివారులో మృతదేహం లభ్యమైంది. శవాన్ని జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించి మార్చురీలో భద్రపరిచామని, సంబంధీకులు సంప్రదించాలని పోలీసులు తెలిపారు.సదరు వ్యక్తి మద్యం మత్తులో ఈ అఘారుుత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
వాగులో పడి మరొకరు గల్లంతు..
నెక్కొండ: గేదెలను మేతకు తీసుకెళ్లి తిరిగి వస్తూ వాగులో పడి ఒకరు గల్లంతయ్యారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. నెక్కొండ మండలం గుండ్రపల్లికి చెందిన బొంపెల్లి రాములు(55) వట్టెవాగు సమీపంలో గేదెలను మేపి, సాయంత్రం ఇంటికి వస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. రాములుకు ఈత రాకపోవడంతో అందులో మునిగిపోయాడు. రాత్రి వరకు వెదికినా ఆచూకీ లభించలేదు.