నర్సరీ అడ్మిషన్లపై ఐదు నెలలుగా కొనసాగుతున్న అనిశ్చితికి ఈ నెల ఏడో తేదీన తెరపడనుంది. ఇందుకు సంబంధించి ఆరోజున సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. అంతర్రాష్ట్ర బదిలీ కేటగిరీ (ఐఎస్‌టీ)లో ఉన్న విద్యార్థులకు నర్సరీలో ప్రవేశం కల్పిస్తామని సూచనప్రాయంగా తెలియజేసింది. దీనిపై సాధారణ ఉత్తర్వు జారీ చేయలేమని, తమ 24 మంది పిల్లల ప్రవేశాల కోసం దరఖాస్తు చేసిన 22 మంది తల్లిదండ్రులకు ఊరట కల్పిస్తామని పేర్కొంది. ఇరుగుపొరుగుతోపాటు ఇతర కేటగిరీల్లో దరఖాస్తు చేసుకుని, లాటరీ విధానంలో ఎంపికైన వారికి ప్రవేశాలు కల్పించాలంటూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు ఇచ్చిన తర్వాత ఏప్రిల్ 11వ తేదీన నర్సరీ అడ్మిషన్లపై సుప్రీంకోర్టు మరోసారి నిలిపివేసిన సంగతి విదితమే. నర్సరీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే నిబంధలను మార్చాలని నిర్ణయించడమేమిటంటూ సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అంతరాష్ట్ర బదిలీ కేటగిరీలో సీట్ల సంఖ్యను ఐదు నుంచి ఆరుకు పెంచాలని సూచించింది. ఇతర రాష్ట్రాల నుంచి బదిలీపై నగరానికి వచ్చి స్థిరపడిన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు దాఖలుచేసిన పిటిషన్లను పరిశీలించిన సుప్రీంకోర్టు పైవిధంగా స్పందించింది.
నర్సరీ అడ్మిషన్లపై ఏడున తీర్పు
Published Mon, May 5 2014 11:09 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement