
ఇన్నాళ్లకు మోదీ ప్రధానిలా వ్యవహరించారు
బులంద్‌షహర్: రెండున్నరేళ్ల పాలనలో ప్రధాని మోదీ.. తొలిసారి ప్రధానిలా వ్యవహరించారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. నియంత్రణ రేఖ వెంబడి.. భారత ఆర్మీ మెరుపు (సర్జికల్)దాడి చేయటంపై మోదీని ప్రశంసించారు. పాక్‌పై భవిష్యత్తులో కేంద్రం తీసుకునే నిర్ణయాలకు కాంగ్రెస్ పార్టీ మద్దతుంటుందన్నారు. ‘ప్రధాని.. ప్రధానిలా వ్యవహరించినపుడు దేశంలో ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాల్సిందే. రెండున్నరేళ్లలో తొలిసారి మంచి నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు దేశమంతా ఆయన వెనకే ఉంది’ అని దేవరియా నుంచి ఢిల్లీకి చేపడుతున్న కిసాన్ యాత్రలో రాహుల్ పేర్కొన్నారు.