చతురంగ వేట్టై-2లో సూర్య
చతురంగ వేట్టై-2 చిత్రంలో నటించేందుకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నటుడు మనోబాల నిర్మించిన చిత్రం చతురంగ వేట్టై. కొత్త దర్శకుడు వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటరాజ్ హీరోగా నటించారు. తిరుపతి బ్రదర్స్ సంస్థ విడుదల చేసిన ఈ చిత్రం మంచి విజయం సాధించడమేగాక విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో హీరోగా నటించేందుకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. ప్రస్తుతం ఆయన వెంకట ప్రభు దర్శకత్వంలో మాస్ చిత్రాన్ని పూర్తిచేసి విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 24 చిత్రంతో పాటు సుశీంద్రన్ దర్శకత్వంలో హైక్యూ చిత్రం చేస్తున్నారు.
ఈ రెండు చిత్రాలను తన టూడీ పిక్చర్స్ పతాకంపై సొంతంగా నిర్మించడం విశేషం. చతురంగ వేట్టై - 2 చిత్రాన్ని సూర్యనే నిర్మించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. సూర్యతో అంజాన్ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించిన దర్శకుడు లింగుస్వామి నష్టాలను చవిచూశారు. చతురంగ వేట్టై చిత్రాన్ని తానే నిర్మిస్తానని కోరడంతో సూర్య ఒకే అన్నట్టు తెలిసింది. వినోద్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని లింగుస్వామి తన తిరుపతి బ్రదర్స్ పతాకంపై నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు త్వరలో వెలువడనున్నాయి.