పుర్రెలతో రైతుల నిరసన
టీ.నగర్: తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ తమిళ రైతులు ఢిల్లీలో సోమవారం రెండో రోజుగా పుర్రెలు, బిక్షాటన పాత్రలతో వినూత్నంగా నిరసన తెలిపారు.
కావేరి మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటుచేయాలని, జాతీయ బ్యాంకుల్లో రైతుల రుణాలను మాఫీ చేయాలని తదితర కోర్కెలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ జాతీయ దక్షిణాది నదుల అనుసంధానం రైతుల సంఘం అధ్యక్షుడు అయ్యాకన్ను ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద తమిళనాడు రైతులు ఆదివారం నుంచి ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే.
ప్రధాని నరేంద్రమోదీ కార్యాలయం ఎదుట గోచీలతో ఆందోళనలో పాల్గొన్న రైతులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి సాయింత్రం విడిపించారు. ఇలాఉండగా సోమవారం రెండో రోజుగా జంతర్‌మంతర్ వద్ద పుర్రెలు, భిక్షాపాత్రలతో వినూత్నంగా ఆందోళన జరిపారు. ఆ సమయంలో జోరున వర్షం కురిసింది. అయినప్పటికీ వర్షంలో తడుస్తూనే వారు తమ కోర్కెలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.