సంక్షోభంలో తెలంగాణ రైతాంగం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
శంకరపట్నం/వీణవంక: రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీని పూర్తిగా చేయకపోవడంతో రైతులు సంక్షోభంలో ఉన్నా రని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మహాజన పాదయాత్రలో భాగంగా ఆయన శనివారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం, వీణవంక, జమ్మి కుంట, ఇల్లందకుంట మండలాల్లో పర్యటించారు. ముఖ్య మంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లో కూర్చుండి రాష్ట్రం సుభి క్షంగా ఉందని భావిస్తున్నా రని, కానీ రైతు కూలీలు, చేతివృత్తుల వారు, కార్మిక కర్షకులు పడు తున్న బాధలు ఆయనకు కనిపించడం లేదని అన్నారు.
పాఠశాలల్లో టీచర్ల కొరత, మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఎర్రవెల్లి, నర్సన్న పేట ఇండ్లను చూపించి రాష్ట్రమంతా నిర్మాణాలు చేసిన ట్లు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకున్నారని ఎద్దేవా చేశారు.