నల్లధనంతో ఉద్యోగులకు ఏంటి సంబంధం..
నల్లధనంతో ఉద్యోగులకు ఏంటి సంబంధం..
Published Fri, Nov 11 2016 12:46 PM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దుతో నల్ల కుభేరుల మాట పక్కన పెడితే.. సామాన్యులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. మొదటి రోజు నోట్ల మార్పిడికి బ్యాంకులకు క్యూ కట్టిన ప్రజలు.. శుక్రవారం నుంచి ఏటీఎమ్ ల వద్ద కొత్త నోట్లు అందుబాటులోకి రావడంతో రద్దీ పెరిగింది. తెలంగాణ సచివాలయంలో ఉన్న రెండు బ్యాంకుల వద్ద రద్దీ ఎక్కువగా ఉంది. ఏటీఎమ్ లలో నగదు తీసుకునేందకు సచివాలయ ఉద్యోగులు క్యూ కట్టారు. నగదు డ్రా విషయంలో రూ.100 నోట్లు తీసుకునేందుకు ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు.
ఈ సందర్భంగా కొందరు ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు. కేంద్రం ఎవరిని దృష్టిలో పెట్టుకుని పెద్ద నోట్లను రద్దు చేసిందో అర్థంకావడం లేదన్నారు. నల్లధనంతో ఉద్యోగులకు ఏంటి సంబంధం.. తామేందుకు ఇబ్బంది పడాలని ప్రశ్నించారు. రోజు వారీ కనీస ఖర్చులకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులు రూ.4 వేలకు మించి ఇవ్వమంటున్నారని.. నిన్న డ్రా చేసిన వారికి ఈ రోజు అవకాశం లేదనడం దారుణమన్నారు. తక్షణమే రోజువారీ నగదు డ్రా చేసుకునే మొత్తాన్ని పెంచాలి ఉద్యోగులు డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement