
కోర్టుకు హాజరైన నటుడు
విచారణలో విష్ణువర్ధన్ కొట్టేసిన సొమ్ములో రూ.5లక్షలు కోవైలో స్టార్‌నైట్ కార్యక్రమం నిర్వహించడానికి నటుడు దాడి బాలాజీకి ఇచ్చినట్లు, ఆయితే ఆ కార్యక్రమం రద్దు కావడంతో ఆ డబ్బును తిరిగి చెల్లించడానికి బాలాజీ నిరాకరించినట్లు తెలిసింది. దీంతో అతన్ని కేసులో నిందితునిగా చేర్చారు. ఈ కేసు తిరుపూర్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం విచారణకు రాగా దాడి బాలాజీ విచారణకు హాజరయ్యాడు. తదుపరి విచారణను అక్టోబరు 4వ తేదీకి వాయిదా వేసి, ఆ రోజు మళ్లీ కోర్టుకు హాజరు కావలసిందిగా దాడి బాలాజీని న్యాయమూర్తి ఆదేశించారు.