
అదే పట్టు!
► చర్చకు స్పీకర్ నిరాకరణ
► ప్రతిపక్షాల వాగ్యుద్ధం
► డీఎంకే వాకౌట్
► ఎక్కడైనా ఎయిమ్స్‌కు ఓకే
► విద్యలో మార్పులు
అసెంబ్లీలో గురువారం కూడా ముడుపుల వ్యవహారంపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. స్పీకర్ నిరాకరించడంతో, వాగ్యుద్ధం సాగింది. స్పీకర్ పాత పురాణం అందుకోవడంతో సభ నుంచి డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. రాష్ట్రంలో ఎయిమ్స్ ఆస్పత్రి ఎక్కడ నిర్మించినా తమకు ఆమోదమేనని ప్రభుత్వం ప్రకటించింది. విద్యా విధానంలో మార్పులకు తగ్గ ముసాయిదాలు అసెంబ్లీకి చేరాయి.
సాక్షి, చెన్నై :లియజేసింది. ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ స్పందిస్తూ, ఐదుచోట్ల పరిశీలన సాగినట్టు గుర్తు చేశారు.
ఎక్కడ ఏర్పాటుచేసినా, అందుకు తాము ఆమోదం తెలుపు అసెంబ్లీలో గురువారం కూడా ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమావేశాల్లో భాగంగా ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో డీఎంకే సభ్యులు సంధించిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. ఇందులో ఎయిమ్స్ ఆస్పత్రి ఏర్పాటు వ్యవహారం కూడా ఉండడంతో, ఈ విషయంలో తమ స్పష్టతను ప్రభుత్వం తెతామని స్పష్టంచేశారు. నీట్‌కు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయానికి తమ ప్రభుత్వం కట్టుబడే ఉందన్నారు.
అలాగే, షోళింగనల్లూరులో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నామని ప్రకటించా రు. సీఎం పళని స్వామి సైతం తన ప్రసంగంలో ఎయిమ్స్, నీట్ విషయంగా ప్రభుత్వ స్పష్టతను వ్యక్తంచేశారు. ఈ సమయంలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ డీఎంకే సభ్యులు రంగనాథన్, అన్భళగన్ స్పీకర్ ధనపాల్‌ను గురిపెట్టి మాటల తూటాలు పేల్చారు. రగడ సృష్టించమంటారా? అని హెచ్చరించడంతో స్పీకర్ తలొగ్గక తప్పలేదని చెప్పవచ్చు.
విచారణకు పట్టు
ప్రశ్నోత్తరాల అనంతరం సభలో ప్రధాన ప్రతి పక్షనేత ఎంకే స్టాలిన్ ముడుపుల వివాదాన్ని మళ్లీ తీసుకొచ్చారు. విచారణకు పట్టుబట్టారు. బుధవారం తమకు వ్యతిరేకంగా సభలో సాగిన తీరును ఎండగట్టే విధంగా ప్రసంగాన్ని అందుకోవడంతో స్పీకర్ ధనపాల్ అడ్డుకునే యత్నం చేశారు.
కోర్టులో ఉన్న విషయం గురించి ఇక్కడ ప్రస్తావన అనవసరం అని తేల్చారు. దీంతో స్పీకర్, ప్రతిపక్ష నేత మధ్య కాసేపు వాగ్యుద్ధం సాగింది. స్పీకర్ స్వరాన్ని పెంచడంతో ప్రతిపక్ష సభ్యులు ఎదురు దాడికి దిగారు. సభలో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. చివరకు స్పీకర్ పాత పురాణం అందుకుని, డీఎంకే హయంలో పత్రికల్లో వచ్చిన వార్తలను ఖాతరు చేయకుండా సాగిన సభాపర్వాన్ని గుర్తు చేస్తూ ప్రసంగాన్ని అందుకున్నారు. ఇప్పుడు ముడుపుల వ్యవహారం కూడా పత్రికల్లో వచ్చిన కథనమేనంటూ గుర్తుచేశారు. దీంతో స్పీకర్ తీరును నిరసిస్తూ సభ నుంచి డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ గవర్నర్‌ను కలిసి ఒత్తిడి తీసుకురాబోతున్నామని ప్రకటించారు.
విద్యావిధానంలో మార్పులు
నీట్ పుణ్యమా అని రాష్ట్రంలోని విద్యావిధానంలో మార్పులకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది. ఇందుకు తగ్గ ముసాయిదా అసెంబ్లీకి చేరింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సెంగోట్టయన్ ఈ ముసాయిదాలను అసెంబ్లీ ముందుంచారు. ప్లస్ ఒన్ పబ్లిక్, ప్లస్ టూ పరీక్షల్లో మార్కుల తగ్గింపులతో పాటుగా పాఠ్యాంశాల మార్పు తదితర అంశాలతో ఈ ముసాయిదాను సిద్ధం చేసి ఉన్నారు. అలాగే, 30 ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటు, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నట్టు సెంగోట్టయన్ అసెంబ్లీలో ప్రకటించారు.